S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/25/2016 - 07:48

న్యూఢిల్లీ, జూన్ 24: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈనెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపి, తెలంగాణ, గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈమేరకు ఉపరాష్టప్రతి కార్యాలయం ఆయా సభ్యులకు లేఖలు రాసింది. మూడు రాష్ట్రాలకు చెందిన కొత్త సభ్యులు అన్సారీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తున్నట్లు తెలిసింది.

06/25/2016 - 07:46

ముంబయి, జూన్ 24: మహారాష్టల్రోని ధూలే జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. జిల్లాలోని సూరత్-నాగ్‌పూర్ హైవేలో ఓ జీపును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎఎస్‌పి చంద్రకాంత్ గాల్జీ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామన్నారు.

06/25/2016 - 07:45

న్యూఢిల్లీ, జూన్ 24: దౌత్యమంటే జనం ముందు తమాషాలు చేయడం కాదని, అందుకు లోతైన అవగాహన, చిత్తశుద్ధి ఎంతో అవసరమనే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. సియోల్‌లో అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి) సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు భారత్‌కు ‘ఇబ్బందికరమైనవి’గా ఉన్నాయని ఆ పార్టీ పేర్కొంది.

06/25/2016 - 07:45

తాష్కెంట్, జూన్ 24: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం కోసం తన దరఖాస్తును ఎన్‌ఎస్‌జి తిరస్కరించడంతో తన దరఖాస్తుపై కూటమిలో చర్చ సందర్భంగా ఒక దేశం పదే పదే నిబంధనల పేరిట అడ్డంకులు సృష్టించిందంటూ పరోక్షంగా చైనాపై భారత్ మండిపడింది.

06/25/2016 - 07:44

ముంబయి, జూన్ 24: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడం అనేది ఆ రెండింటికి సంబంధించిన అంశమే కాదు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మీద పడుతుంది. ఇయు నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనని ఆ దేశ ప్రజలు రెఫరెండంలో ఇచ్చిన తీర్పు వెలువడిన వెంటనే భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం దీనికి ఒక సంకేతం.

06/24/2016 - 18:30

దిల్లీ: ఈయూతో సంబంధాలపై బ్రిటన్‌ ఏ విధంగా ప్రజాభిప్రాయానికి వెళ్లిందో ఆ విధంగానే దిల్లీకి రాష్ట్ర హోదాని సంపాదించడానికి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. బ్రెగ్జిట్‌ ఫలితాల అనంతరం ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. దిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ కొంత కాలంగా కేజ్రివాల్‌ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.

06/24/2016 - 17:43

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు ఎందుకు వెళుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆప్ నేత, దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విమర్శించారు. మోదీ విదేశాంగ విధానం వైఫల్యం దిశగా ఉందన్నారు. ఎన్‌ఎస్‌జి (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లో భారత్ చేరికపై ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు.

06/24/2016 - 17:41

భువనేశ్వర్: బిజెపి కార్యకర్తలు ఏర్పాటు చేసిన వికాస్ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు శుక్రవారం ఒడిశా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రయాణిస్తున్న కారుపై బిజూ జనతాదళ్ (బిజెడి) కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకోవాలని బిజెడి కార్యకర్తలు బర్గాడ్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కొందరు బిజెడి కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు.

06/24/2016 - 16:19

ముంబయి: ఇది భారతీయ స్టాక్ మార్కెట్లకు అనూహ్యమైన పతనం. ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా సెనె్సక్స్ కోల్పోయింది. మన స్టాక్ మార్కెట్లు తరచూ ఆటుపోట్లను ఎదుర్కొనడం కొత్తేమీ కాకున్నా బ్రిగ్జిట్ మాత్రం శరాఘాతంలా తగిలింది. ఆర్‌బిఐ గవర్నర్ పదవి విషయంలో రఘురాం రాజన్ ప్రకటన చేసిన నాడు కూడా స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇంతలోనే బ్రిగ్జిట్ ప్రభావం కోలుకోలేని విధంగా పడింది.

06/24/2016 - 16:18

చెన్నై: చెన్నైలోని సుగంబాకం రైల్వేస్టేషన్‌లో రైలు కోసం నిరీక్షిస్తున్న స్వాతి (25) అనే ఇన్ఫోసిస్ ఉద్యోగినిని పట్టపగలే ఓ ఆగంతకుడు హత్య చేసి పరారయ్యాడు. ఆ వ్యక్తి కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాగా తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

Pages