S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/04/2016 - 08:32

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధానికి సంబంధించి ఇచ్చిన హామీలన్నింటినీ పాకిస్తాన్ నెరవేర్చాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం గురువారంనాడు విస్పష్టంగా ప్రకటించింది.

03/04/2016 - 08:32

న్యూఢిల్లీ: జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం జరిపించిన మెజిస్టీరియల్ విచారణలో జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు క్లీన్‌చిట్ లభించింది. ఫిబ్రవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో కన్హయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ విచారణలో తేలింది.

03/04/2016 - 08:31

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఇక్కడ స్పందించారు. ఏడుగురు హంతకులను విడుదల చేయాలన్న జయలలిత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

03/04/2016 - 08:29

న్యూఢిల్లీ: ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయడానికి ఉపయోగించడం కోసం ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడానికి ఉద్దేశించిన ఒక బిల్లును గురువారం ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం ఈ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన తెలియజేశాయి.

03/04/2016 - 06:49

రాహుల్‌పై
మోదీ పరోక్ష విసుర్లు

చెప్పడం తేలికేనంటూ వ్యంగ్యోక్తులు
కాంగ్రెస్‌ది ఆత్మన్యూనతే
ఏప్రిల్ 1నుంచి పంటల బీమా పథకం
ప్రతిపక్షంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం
యువ ఎంపీలు, మహిళలకు మాట్లాడే అవకాశం
ధన్యవాద ప్రసంగంలో ప్రధానమంత్రి వెల్లడి

03/04/2016 - 06:42

న్యూఢిల్లీ: క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల అవసరం ఏమిటని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని సుప్రీం కోర్టు నిలదీసింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం కష్టమంటూ బిసిసిఐ దాఖలు చేసిన కౌంటర్‌పై ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఇబ్రహీం కలిఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ స్పందించింది.

03/03/2016 - 19:45

హైదరాబాద్:్ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎస్‌ఐ ఒకరు గాయపడ్డారు.

03/03/2016 - 19:44

న్యూదిల్లి : దేశద్రోహం కేసులో నిందితుడు, జెఎన్‌యు విద్యార్థిసంఘం నాయకుడు కన్నయ్యకుమార్ జైలునుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు. పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన తీవ్రవాది అఫ్జల్‌గురుకు అనుకూలంగా జెఎన్‌యులో నిర్వహించిన ర్యాలీలో జాతివ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగంపై కన్నయ్యసహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహ నేరం మోపారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనమై వివాదంగా మారింది.

03/03/2016 - 18:13

దిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడేందుకు మహిళా ఎంపీలకు మాత్రమే అవకాశం ఇస్తారు. ప్రధాని మోదీ ఆలోచన మేరకు ఈ అవకాశం మహిళా ఎంపీలకు దక్కనుంది. ఆ రోజున కేవలం మహిళా ఎంపీలే మాట్లాడాలని, పురుష ఎంపీలు వారికి సహకరించాలని మోదీ సూచించారు. తొలిసారిగా గెలిచిన మహిళా సభ్యులకు ముందుగా అవకాశం ఇవ్వాలని కూడా ప్రధాని కోరారు.

03/03/2016 - 18:11

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో అతను ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీలోని జంతర్ మంతర్, జెఎన్‌యు, దిల్లీ యూనివర్సిటీ ప్రాంతాల్లో జరిగే ఆందోళనల్లో కన్నయ్య పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు.

Pages