S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/23/2016 - 14:07

దిల్లీ: నిత్యం వివాదాలను సృష్టించే బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి ఇపుడు ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలతో వేడి రగిలిస్తున్నారు. ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి పదే పదే లేఖలు రాసిన ఆయన ఇపుడు ప్రధాని ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌పై విరుచుకుపడుతున్నారు.

06/23/2016 - 14:06

దిల్లీ: నదీజలాల పంపకంపై ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య రాజీ కుదరలేదు. ఇక్కడ గురువారం ఉదయం కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో ఎపి, తెలంగాణ ఇరిగేషన్ మంత్రులు దేవినేని ఉమా, హరీష్ రావు భేటీ అయినప్పటికీ ప్రతిష్టంభన తొలగిపోలేదు. మంత్రులిద్దరూ ఏకాభిప్రాయానికి రానందున సమావేశం అర్ధంతరంగా ముగిసింది.

06/23/2016 - 12:06

దిల్లీ: ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు దేవినేని ఉమా, హరీష్‌రావు గురువారం ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో భేటీ అయ్యారు. కృష్ణా రివర్ బోర్టు, గోదావరి జలాల వినియోగం విషయంలో గత రెండురోజులుగా జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో మంత్రులిద్దరూ భేటీ అయ్యారు.

06/23/2016 - 08:08

న్యూఢిల్లీ, జూన్ 22: లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు తీపి కబురు. ప్రయాణికుల సౌలభ్యం, ప్రయోజనాలకోసం ఎంతో కృషిచేస్తున్న భారతీయ రైల్వేలు మరింత లబ్ధి చేకూర్చడానికి నియమ, నిబంధనల్లో మార్పులు చేసింది. మొదటిది వెయిటింగ్ లిస్ట్ జారీకి స్వస్తిచెప్పడం. జూలై 1 నుంచి వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు జారీ చేయరు. కన్‌ఫర్మ్ టిక్కెట్లు మాత్రమే ప్రయాణికులకు జారీ చేస్తారు.

06/23/2016 - 08:05

న్యూఢిల్లీ, జూన్ 22: గతంలో వివిధ సంస్థలకు జరిపిన 29 భూ కేటాయింపులను రద్దుచేస్తూ యుపిఏ ప్రభుత్వం తీసుకున్న చర్యను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించింది.

06/23/2016 - 08:04

న్యూఢిల్లీ, జూన్ 22: నిన్నటిదాకా ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించిన బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ఇప్పుడు తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను టార్గెట్ చేసుకోవడమే కాకుండా ఆయనను తక్షణం ఆ పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

06/23/2016 - 08:04

న్యూఢిల్లీ, జూన్ 22: అణు సరఫరాదారుల గ్రూప్‌లో (ఎన్‌ఎస్‌జి) భారత్‌కు సభ్యత్వం విషయంలో క్రమంగా మద్దతు బలపడుతోంది. ఎన్‌పిటిపై సంతకం చేసిన దేశాలకే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించాలన్న చైనా అభ్యంతరం నేపథ్యంలో తాజాగా ఫ్రాన్స్ కూడా భారత్‌ను బలపరిచింది. 48 దేశాల ఎన్‌ఎస్‌జిలో కీలక సభ్య దేశంగా ఉన్న ఫ్రాన్స్ మద్దతు లభించడం భారత్ సభ్యత్వ ప్రయత్నాలకు మరింత ఊతం లభించినట్టయింది.

06/23/2016 - 08:03

న్యూఢిల్లీ, జూన్ 22: ఔషధ నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో యుపిఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించుకొని, దాని స్థానంలో మూలకణ పరిశోధనసహా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకొని మరో కొత్త బిల్లును తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

06/23/2016 - 08:02

పాట్నా/ఘజియాబాద్, జూన్ 22: బిహార్, ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సానికి 63 మంది మృతి చెందారు. రెండు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అతలాకుతలం చేశాయి. బిహార్‌లో 57 మంది, యూపీలో ఆరుగురు మరణించారు. బిహార్‌లో 57 మంది మృతి చెందారని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. రాష్ట్రాన్ని మంగళవారం నుంచి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

06/23/2016 - 07:03

న్యూఢిల్లీ, జూన్ 22: ఆంధ్ర మొండి వైఖరి కారణంగానే కృష్ణా నదీ జలాల వినియోగంపై అవగాహన కుదరటం లేదని తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతి సూచనతో ఏపీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని బుధవారం రాత్రి మీడియా సమావేశంలో హరీశ్ ప్రకటించారు.

Pages