S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/23/2016 - 06:55

న్యూఢిల్లీ, జూన్ 22: తెలంగాణ తొండివాదం వల్లే కృష్ణా జలాల వినియోగంపై అవగాహన కుదరటం లేదని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జల వివాదం పరిష్కారానికి కేంద్రం వెంటనే అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు చర్చలు జరిపిన అనంతరం ఉమ మీడియాతో మాట్లాడారు.

06/23/2016 - 06:54

న్యూఢిల్లీ,జూన్ 22: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి జోక్యం చేసుకున్నా ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగంపై తలెత్తన వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. కృష్ణా జలాల వివాదం చివరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వైపుదారి తీస్తోంది.

06/22/2016 - 18:19

దిల్లీ: ప్రధానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న అరవింద్ సుబ్రమణియన్‌కు తక్షణం ఉద్వాసన పలకాలంటూ బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇద్దరు కేంద్ర మంత్రులు స్పందించారు. అరవింద్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన ఇచ్చే సలహాలకు ఎంతో విలువ ఉందని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

06/22/2016 - 18:18

తిరువనంతపురం: కేరళ క్రీడామండలి అధ్యక్ష పదవికి ప్రముఖ అథ్లెంట్ అంజూ జార్జ్ బుధవారం రాజీనామా చేశారు. క్రీడల మంత్రి జయరాజన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పదవి నుంచి తప్పుకున్నట్లు ఆమె ప్రకటించారు. గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హయాంలో కేరళ క్రీడామండలి అధ్యక్షురాలిగా అంజూ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ అధికారంలోకి వచ్చాక క్రీడల మంత్రిగా జయరాజన్ బాధ్యతలు చేపట్టారు.

06/22/2016 - 18:17

ముంబయి: మహారాష్ట్ర సదన్ కుంభకోణం కేసులో ఎన్‌సిపి నేత, మాజీ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు, ఆయన మేనల్లుడు సమీర్‌లకు ఇక్కడి ఎసిబి ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, మరికొన్ని పెండింగ్ కేసుల వల్ల వారు జైలు నుంచి విడుదల కాని పరిస్థితి నెలకొంది. ఏభై వేల రూపాయల పూచీకత్తుపై భుజ్‌బల్, సమీర్‌లకు ఎసిబి కోర్టు బెయిల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.

06/22/2016 - 18:16

కొచ్చి: ఇక్కడి నేవీ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఎలక్ట్రిక్ ఆర్టిఫైసర్‌గా పనిచేస్తున్న నావికుడు రూపారామ్ (25) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సహచర ఉద్యోగులు కనుగొని ఉన్నతాధికారులకు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన రూపారామ్ ఏడేళ్లుగా నేవీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, 9నెలల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై విచారణకు నేవీ ఆదేశించింది.

06/22/2016 - 17:47

దిల్లీ: ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండు లేకపోవడం తదితర కారణాల వల్ల బంగారం ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. పసిడి ధర బుధవారం రూ.50 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రూ.29,700కి చేరింది. సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.5శాతం తగ్గి 1,261.27 యూఎస్‌ డాలర్లకు చేరింది. జూన్‌9 తర్వాత ఇదే కనిష్ఠ ధర కావడం గమనార్హం.

06/22/2016 - 16:45

దిల్లీ: బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 47 పాయింట్లు నష్టపోయి 26,766 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 8,204 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.46 వద్ద కొనసాగుతోంది.

06/22/2016 - 16:10

దిల్లీ: కృష్ణానదీ జలాల పంపకంపై ఎపి, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఇక్కడ బుధవారం జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ ఉభయ రాష్ట్రాల ప్రతినిధులు ఎవరివాదనలు వారు వినిపించారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం గత ఏడాది లాగానే మరో నెల రోజుల పాటు కృష్ణాజలాలను వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకూ సూచించింది. దీనిపై ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది.

06/22/2016 - 14:10

దిల్లీ: దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ‘మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌’ పేరుతో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఆఫర్లను ప్రకటించింది. జమ్ము-శ్రీనగర్‌, అహ్మదాబాద్‌-ముంబయి, ముంబయి-గోవా, దిల్లీ-డెహ్రడూన్‌, దిల్లీ-అమృత్‌సర్‌ రూట్లలో ఒక వైపు ఛార్జీ రూ.444 మాత్రమేనని పేర్కొంది. ఐదు రోజుల పాటు అంటే జూన్‌ 26 వరకు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.

Pages