S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/27/2016 - 03:50

న్యూఢిల్లీ, మే 26: సంస్కరణల అమలుతో వేగవంతమైన అభివృద్ధి సాధనకు మార్గ నిర్దేశనం చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, తమది గరిష్ట సంస్కరణల ప్రభుత్వమని ప్రకటించారు. తనముందు ఇంకా అపరిమితమైన పని ఉందన్నారు.

05/27/2016 - 03:48

న్యూఢిల్లీ, మే 26: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రసంగాలు తప్ప పాలనపై దృష్టి కేంద్రీకరించడం లేదని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా, సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ఆరోపించారు.

05/27/2016 - 03:45

న్యూఢిల్లీ, మే 26: ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీగా మారిపోయిందని, దాని స్థాయిని దిగజార్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. మోదీ సర్కార్ రెండేళ్ల పాలనపై స్పందిస్తూ దేశంలో అవినీతి, దౌర్జన్యం పెచ్చరిల్లిందని ఆరోపించింది.

05/27/2016 - 03:43

గయ, మే 26: హిందూస్తానీ అవాం మోర్చా అధ్యక్షుడు, బిహార్ మాజీ సిఎం జితన్ రాం మాంఝీ కాన్వాయ్‌పై గురువారం దాడి జరిగింది. ఎల్‌జెపి నేత హత్యకు నిరసగా ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు. ఎల్‌పిజి నేత సుదేశ్ పాశ్వాన్, ఆయన కజిన్ సునీల్ పాశ్వాన్‌ను బుధవారం మావోయిస్టులు హత్యచేశారు. హంతకులను తక్షణం అరెస్టు చేయాలంటూ ఆందోళనకుదిగిన జనం మాంఝీ కాన్వాయ్‌పై దాడి చేశారు.

05/27/2016 - 03:38

న్యూఢిల్లీ, మే 26: కేరళలో ఇద్దరు భారతీయ జాలర్లపై కాల్పుల ఘటనలో ఇటాలియన్ మెరైన్ సాల్వెటోర్ గిరోనే స్వదేశం వెళ్లేందుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. 2012లో కేరళ తీరంలో ఇద్దరు భారతీయ జాలర్లపై ఇటవీ నౌకాసిబ్బంది కాల్పులు జరిపారు. మిస్సిమిలియానో లట్టోరే, సాల్వెటోర్ గిరోనేలపై అభియోగాలు నమోదయ్యాయి. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

05/27/2016 - 03:38

న్యూఢిల్లీ, మే 26: కోచీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం లావెట్రీలో కిలో బంగారాన్ని సిబ్బంది కనుగొన్నారు. దుబాయి నుంచి వచ్చిన ఈ విమానం విమానాశ్రయంలో దిగగానే తనిఖీల్లో ఇది బయటపడింది. దీనికి సంబంధించి ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూస్ పేపర్‌లో చుట్టిన కిలో బరువైన బంగారం కడ్డీలు లావెట్రీలోని టిస్యూ బాక్స్ కింద దాచి ఉంచారు.

05/27/2016 - 03:37

న్యూఢిల్లీ, మే 26: ఢిల్లీలో అత్యాచారానికి గురై ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలికను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం పరామర్శించారు. మానసిక వికలాంగురాలైన మైనర్‌పై అత్యాచారం చేసి ఆగ్నేయ ఢిల్లీలోని పుల్ ప్రహ్లాద్‌పూర్ రైల్వే ట్రాక్ వద్ద వదిలేశారు. ఈ నెల 17న కనిపించకుండాపోయింది.

05/27/2016 - 03:36

చండీగఢ్, మే 26: హర్యానాలో జాట్లకు, మరో అయిదు కులాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంఎల్ ఖట్టర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు గురువారం నిలిపివేసింది.

05/27/2016 - 03:35

న్యూఢిల్లీ, మే 26: విభజన చట్టం అమలు విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్ విమర్శించారు. ఢిల్లీలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలోని అంశాలు హైకోర్టు విభజన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అధికారుల విభజన, విద్యాసంస్థల ఏర్పాటులో కేంద్ర తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు.

05/26/2016 - 18:22

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగిస్తున్న రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి గళం విప్పారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి మళ్లీ లేఖ రాశారు.

Pages