S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/22/2016 - 03:05

బీహార్: శనివారం దేశవ్యాప్తంగా ప్రజలు బుద్ధ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా బిహార్‌లోని గయలో గల మహాబోధి ఆలయంలో బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్నారు.

chitram బుద్ధపూర్ణిమ కార్యక్రమంలో డప్పు కొడుతున్న నితీశ్

05/22/2016 - 03:02

న్యూఢిల్లీ, మే 21: కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలు తమ శక్తియుక్తులను కూడదీసుకొని ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతారని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దినోత్సవంలో రాజ్‌నాథ్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పాల్గొన్నారు.

05/22/2016 - 03:00

న్యూఢిల్లీ, మే 21: హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాపై సిబిఐ కేసు నమోదైంది. హుడా చైర్మన్‌గా ఉన్న హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌యుడిఎ)కు చెందిన పంచకుల ప్లాట్లు కేటాయింపుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై హర్యానా విజిలెన్స్ బ్యూరో విచారించిం ది.

05/22/2016 - 02:59

ఉజ్జయిని, మే 21: నెలరోజుల పాటు సాగిన సింహస్థ కుంభమేళా ఘనంగా ముగిసింది. శనివారం ఆఖరి రోజుకావడంతో తెల్లవారు జామునే సాధువులు, నాగసాధువులు స్నానఘట్టాలకు చేరుకున్నారు. క్షిప్రా నదీ తీరమంతా కిటకిటలాడింది. హరహర మహాదేవ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఆఖరి రోజు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు ప్రవిత్ర స్నానాలు ఆచరించారని ప్రధాన పురోహితుడు ఈశ్వర్ శర్మ వెల్లడించారు.

05/22/2016 - 02:57

న్యూఢిల్లీ, మే 21: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు మరోసారి సత్తా చాటుకున్నారు. శనివారం ప్రకటించిన ఈ ఫలితాల్లో బాలికలు 88.58 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 78.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో బాలుర కంటే బాలికలదే పైచేయి అని మరోసారి రుజువైంది. ఈ పరీక్షలో దక్షిణ భారత విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించారు.

05/22/2016 - 02:54

న్యూఢిల్లీ, మే 21: బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ మారణహోమం, కాశ్మీర్, ముజఫర్‌నగర్‌లలోముస్లింలను చంపేసినందుకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి కత్తులతో వస్తున్నామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో అరబిక్ భాషలో ఉంచిన 22 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో భారత్‌నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తమ సంస్థలో ఏయే హోదాలో ఉన్నారో కూడా వివరించింది.

05/21/2016 - 18:29

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఇక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ కె.రోశయ్యను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆమె గవర్నర్‌కు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే. వరసగా రెండోసారి సిఎం పదవిని చేపడుతూ ఆమె అరుదైన ఘనతను సాధించారు.

05/21/2016 - 18:28

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరి మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలబడడంతో రాహుల్ డీలా పడ్డారని పార్టీ వర్గాల సమాచారం.

05/21/2016 - 18:27

గౌహతి: అస్సాంను ప్రధానంగా వేధిస్తున్న అక్రమ చొరబాట్లను పూర్తిస్థాయిలో నివారిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బిజెపి నేత శర్వానంద సోరోవాల్ శనివారం స్పష్టం చేశారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు బంగ్లాదేశ్ సరిహద్దులను శాశ్వతంగా మూసేవేసేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండేళ్ల వ్యవధి ఇచ్చారని, ఈలోగానే చొరబాటుదారులను గుర్తించేందుకు హేతుబద్ధంగా అధ్యయనం జరుగుతుందన్నారు.

05/21/2016 - 18:27

కోల్‌కత: ఈనెల 27న ఇక్కడ జరిగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథమహారథులు హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి వస్తున్నారు.

Pages