S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/21/2016 - 17:14

దిల్లీ: యాపిల్ కంపెనీ అధినేత టిమ్‌కుక్ శనివారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ‘నరేంద్రమోదీ మొబైల్ యాప్’ తాజా వెర్షన్‌ను ప్రారంభించారు. కుక్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోసారి భారత్‌కు రావాలనుందని కుక్ తెలిపారు.

05/21/2016 - 17:13

దిల్లీ: దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి రైల్వే సేవలను మెరుగుపరుస్తామని, ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఎపి ఎక్స్‌ప్రెస్ సమయాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

05/21/2016 - 12:44

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా ఎల్‌డిఎఫ్ శాసనసభా పక్షం నేత పినరయి విజయన్ ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన శనివారం ఇక్కడ సిపిఎం సీనియర్ నేతలు అచ్యుతానందన్, బాలకృష్ణన్‌లను కలిశారు. మంత్రివర్గం కూర్పు విషయమై సీనియర్ నేతలతో చర్చించినట్టు విజయన్ తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు పూర్తి ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే.

05/21/2016 - 12:08

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా దేశ రాజధానిలోని ఆయన సమాధి వద్ద శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా రాజీవ్ వర్ధంతిని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిర్వహించారు.

05/21/2016 - 05:33

కోల్‌కతా, మే 20: సైద్ధాంతికంగా తూర్పు పడమరలులాంటి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల కూటమి ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం, మమతా బెనర్జీ అభివృద్ధి మంత్రం పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీని అందించడమే కాక మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టాయి.

05/21/2016 - 05:22

చెన్నై, మే 20: మద్యపాన నిషేధం లాంటి సున్నితమైన అంశాలు, అన్నాడిఎంకె పార్టీపై ప్రతిపక్షాలు చేసిన అవినీతి ఆరోపణలులాంటివేవీ కూడా తమిళనాడు ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయనే విషయం ఈ నెల 16న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాక తన ఓటింగ్ ఓటింగ్ శాతాన్ని మెరుగుపర్చుకోవడాన్ని బట్టి స్పష్టమవుతోంది.తమిళనాడులో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోను పార్టీలన్నీ కూడా అన

05/21/2016 - 05:20

న్యూఢిల్లీ, మే 20: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 7నుంచి రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా రక్షణ, భద్రత, ఇంధన తదితర కీలక రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షించడం కోసం అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చలు జరుపుతారు.

05/21/2016 - 05:18

గౌహతి, మే 20: అసోంలో చరిత్రాత్మక విజయం సాధించిన బిజెపి ఇప్పటివరకు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉండిన ఎగువ అసోం, బారక్ వ్యాలీ ప్రాంతాల్లో ఆ పార్టీని తుడిచిపెట్టడంతో పాటు మైనారిటీ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండే జిల్లాల్లోకి కూడా చొచ్చుకు పోగలిగింది.

05/21/2016 - 05:17

గువహటి, మే 20: అస్సాం బిజెపి లెజిస్టేచర్ పార్టీ నేతగా శర్వానంద సోనోవాల్‌ను ఎన్నికకానున్నారు. ఈనెల 22న బిజెపి శాసన సభ్యులందరూ సమావేశమవుతున్నారు. లెజిస్లేచర్‌పార్టీ నేతగా సోనోవాల్ ఎంపిక లాంఛనమే. ప్రస్తుతం కేంద్ర క్రీడలశాఖ సహాయ మంత్రిగా ఉన్న 53 ఏళ్ల శర్వానంద్ సోనోవాల్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ బిజెపి శాసన సభ్యులు సమావేశమయ్యారు.

05/21/2016 - 05:17

తిరువనంతపురం, మే 20: ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలుపెట్టుకున్న 93ఏళ్ల అచ్యుతానందన్‌కు నిరా శే ఎదురైంది. సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ కేరళ సిఎం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు తిరుగులేని మెజారిటీ వచ్చింది. సిపిఎం కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో విజయన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

Pages