S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2016 - 18:19

దిల్లీ: అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ప్రముఖులు ఓటమి చవిచూశారు. రాజకీయ నాయకులే కాదు, కొందరు సినీనటులు, క్రీడాకారులు సైతం ఓటర్లను చూరగొనలేకపోయారు. తమిళనాడులో డిఎండికె పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ ఓడిపోయారు. కేరళలో తిరువనంతపురం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ గెలవలేకపోయారు.

05/19/2016 - 18:19

విజయవాడ: ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు జయలలిత, మమతాబెనర్జీలను ఎపి సిఎం చంద్రబాబు అభినందించారు. కేరళలో ఆధిక్యత సాధించిన ఎల్‌డిఎఫ్ నేతలకు, అస్సాంలో చరిత్ర సృష్టించిన బిజెపి నాయకులకు, పుదుచ్చేరిలో మెజారిటీ సాధించిన కాంగ్రెస్, డిఎంకె నేతలకు ఆయన ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

05/19/2016 - 18:17

గయ (బిహార్): మద్యం సీసాలను అక్రమంగా నిల్వ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడియు ఎమ్మెల్సీ మనోరమాదేవికి బెయిల్ ఇచ్చేందుకు ఇక్కడి కోర్టు నిరాకరించింది. మనోరమ కుమారుడు రాకీ యాదవ్ గయ పట్టణంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని తుపాకీలో కాల్చి చంపిన కేసులో అరెస్టు కాగా, ఆ కేసు విచారణలో సహకరించనందుకు మనోరమపై కూడా పోలీసులు కేసు పెట్టారు.

05/19/2016 - 18:16

తిరువనంతపురం: కేరళలోని కన్నూరులో సిపిఎం నేత పిసరాయి విజయన్ గెలుపు సందర్భంగా గురువారం జరిగిన విజయోత్సవ ర్యాలీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. సిపిఎం, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

05/19/2016 - 17:25

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నగరంలోని క్వీన్‌ల్యాండ్స్ పాఠశాల వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అన్నాడిఎంకె, డిఎంకె కార్యకర్తలు వాదనకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

05/19/2016 - 17:18

దిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించడంతో కొత్త ముఖ్యమంత్రిని శుక్రవారం ఎంపిక చేస్తామని సిపిఎం నాయకుడు ప్రకాష్ కారత్ గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో 91 సీట్లను ఎల్‌డిఎఫ్ కైవసం చేసుకుంది.

05/19/2016 - 16:14

పుదుచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డిఎంకె కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించడంతో పిసిసి అధ్యక్షుడు నమశ్శివాయ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. 30 సీట్లు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమికి 17 స్థానాలు లభించాయి. విల్లియనూర్ నుంచి గెలిచిన నమశ్శివాయను సిఎం పదవికి కాంగ్రెస్ ప్రతిపాదించే సూచనలున్నాయి.

05/19/2016 - 16:11

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత దక్కడంతో విజయోత్సవాలు చేసుకుంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. అసన్‌సోల్‌లోని సిపిఎం కార్యాలయంలోకి వారు ప్రవేశించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వామపక్ష పార్టీలకు రాష్ట్రంలో ఇక స్థానం లేదని నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

05/19/2016 - 15:17

పుదుచ్చేరి: తమిళనాడు, బెంగాల్, అస్సాం, కేరళలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్ని మిగల్చగా పుదుచ్చేరిలో ఆ పార్టీకి కొంత ఊరట లభించింది. అస్సాం, కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 14, దాని మిత్రపక్షమైన డిఎంకెకు 5, ఎన్‌ఆర్‌సి పార్టీకి పది స్థానాలు లభించాయి.

05/19/2016 - 15:16

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలుండగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలపై రెండు చోట్ల ఎన్నికలను వాయిదా వేశారు. పోలింగ్ జరిగిన 232 నియోజకవర్గాల్లో రెండు స్థానాలకు సంబంధించి ఫలితాలు అందాల్సి ఉంది. ఇప్పటికి 122 స్థానాలను అధికార అన్నాడిఎంకె పార్టీ కైవసం చేసుకోగా ముఖ్యమంత్రి జయలలిత మరోసారి పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కంటే కాస్త మెరుగ్గా డిఎంకె 107 స్థానాలను సాధించింది.

Pages