S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/14/2015 - 06:39

కోల్‌కతా, డిసెంబర్ 13: భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయమని, ప్రతి వ్యక్తి ఎలాంటి భయాలు, అనుమానాలు లేకుండా జీవించినప్పుడే సామాజిక వ్యవస్థ బలంగా ఉంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ‘డయోసిస్ ఆఫ్ కలకత్తా’ ద్విశతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్టప్రతి మాట్లాడుతూ, ప్రతి మతం కూడా మానవతా విలువలనే బోధిస్తుందన్నారు.

12/14/2015 - 06:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్‌లలో దాదాపు 300 కోట్ల పెట్టుబడితో సెల్‌ఫోన్లను ఉత్పత్తి చేయాలని మైక్రోమాక్స్ సంకల్పిస్తోంది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతోనే దేశీయంగా వీటి ఉత్పత్తులను చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.

12/14/2015 - 06:29

ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్‌కు హోంమంత్రి రాజనాథ్ సింగ్ ఆదివారం స్వయంగా
ముంబయిలోని ఆయన నివాసానికి వెళ్లి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న దృశ్యం.

12/13/2015 - 05:38

పుణె, డిసెంబర్ 12: రైతులకు గిట్టుబాటు ధర కోసం దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నడిపిన ప్రముఖ రైతు నాయకుడు శరద్ జోషి శనివారం ఇక్కడ కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 81 ఏళ్ల జోషి ఇక్కడి తన నివాసంలో తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గొప్ప పరిశోధకుడు కూడా అయిన జోషి 2004 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

12/13/2015 - 05:37

వారణాసి, డిసెంబర్ 12: మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని షింజే అబే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో పవిత్ర గంగానదికి పూజలు జరిపి అక్కడ జరిగే గంగా హారతిలో పాలు పంచుకున్నారు.

12/13/2015 - 05:34

స్వచ్ఛ్భారత్ ప్రచారం నిమిత్తం శనివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇస్తున్న కళాకారులు

12/13/2015 - 05:20

ముంబయి- అహ్మదాబాద్ మధ్య తొలి రైలు
98వేల కోట్ల ప్రాజెక్టుకు జపాన్‌తో ఒప్పందం
రక్షణ, అణు ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు
సరికొత్త శిఖరాలకు ద్వైపాక్షిక సంబంధాలు
సంయుక్త ప్రకటనలో మోదీ, అబే స్పష్టీకరణ

12/13/2015 - 03:32

అదే రెండు దేశాల అభివృద్ధికి బాటలు వేస్తుంది
తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్

12/13/2015 - 03:30

జైట్లీ ప్రోద్బలంతోనే ఐటి నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసుపై సిబాల్

12/13/2015 - 03:29

వారణాసి, డిసెంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే వారణాసి రాక సందర్భంగా కనీవినీ ఎరగని భద్రత కల్పించారు. నగర శివార్లలోని బాబత్‌పూర్ విమానాశ్రయం వద్ద ఇరువురు దేశాధినేతలకు ఘనస్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు మనోజ్ శర్మ, కల్‌రాజ్ మిశ్రా ఇరువురు ప్రధానులకు ఘనస్వాగతం పలికారు.

Pages