S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/17/2016 - 20:41

విశాఖ: చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే తమిళనాడులోని అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

05/17/2016 - 16:49

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు, ప్రధాని మోదీ మధ్య భేటీ ముగిసింది. మంగళవారం ఉదయం ప్రధానిని కలిసిన సందర్భంగా ఎపిలో కరవు పరిస్థితి, నీరు-చెట్టు, పోలవరం, రాజధాని నిర్మాణం, విభజన సమస్యలు, నియోజకవర్గాల పునర్విభజన, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వంటి 12 అంశాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థిక మంత్రి యనమలతో పాటు కొందరు సీనియర్ అధికారులు బాబు వెంట ఉన్నారు.

05/17/2016 - 16:47

దిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి 9న దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో జరిగిన అఫ్జల్‌గురు సంస్మరణ సభలో కొందరు విద్యార్థులు జాతి వ్యితిరేక వ్యాఖ్యలు చేసినట్లు కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ సభకు సంబంధించి నాలుగు వీడీయాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలించి ఈ విషయాన్ని కనుగొంది. పార్లమెంటుపై ఉగ్రదాడికి సంబంధించి నేరస్థుడైన అఫ్జల్‌గురును 2013 ఫిబ్రవరి 9 ఉరి తీశారు.

05/17/2016 - 14:12

దిల్లీ: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 13 వార్డు పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత చాటుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అనూహ్యంగా సత్తా చాటుకుంది. ఉప ఎన్నికలు జరిగిన 13 స్థానాల్లో ఆప్‌కు 5, కాంగ్రెస్‌కు 4, బిజెపికి 3 వార్డులు దక్కాయి. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

05/17/2016 - 14:11

దిల్లీ: బాలీవుడ్ నటి జియాఖాన్ అనుమానాస్పద మృతి కేసును వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం సిబిఐని ఆదేశించింది. మూడేళ్ల క్రితం జియా అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో సిబిఐ అలసత్వం చూపుతోందంటూ ఆమె తల్లి రుబియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం స్పందించింది. కేసు విచారణను 2014లో సిబిఐ చేపట్టినా ఇప్పటికీ విచారణ తంతు పూర్తికాలేదు.

05/17/2016 - 14:10

దిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్‌ను వెంటనే చికాగోకు పంపేయాలంటూ బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోదీకి ఘాటుగా లేఖ రాశారు. రాజన్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, ఆర్థికరంగాన్ని నాశనం చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నాడని స్వామి ఆరోపించారు. నిజమైన భారతీయుడిలా ఆయన వ్యవహరించడం లేదని, వెంటనే ఆర్‌బిఐ గవర్నర్ పదవి నుంచి ఉద్వాసన పలకాలని స్వామి తన లేఖలో సూచించారు.

05/17/2016 - 14:10

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని మోదీని బాబు కలిశారు. ఆ తర్వాత ప్రధానితో ఆయన ముఖాముఖి మాట్లాడతారని సమాచారం. రాష్ట్రంలో కరవు పరిస్థితి, నీరు-చెట్టు, పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, ఎపికి ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు, నీటి వివాదాలు వంటి విషయాలను మోదీకి బాబు వివరించే అవకాశం ఉంది.

05/17/2016 - 14:08

శ్రీనగర్: ఉగ్రవాదులు తిష్టవేసిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో మంగళవారం ఉదయం కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు హతమార్చారు. పోషియార్ జిల్లాలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందడంతో బిఎస్‌ఎఫ్ సైనికులు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సైనికులను చూసి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీనికి సమాధానంగా భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి.

05/17/2016 - 11:54

గయ: బిహార్‌లో అధికార జెడియు పార్టీ ఎమ్మెల్సీ మనోరమ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడి మంగళవారం ఉదయం గయ కోర్టులో లొంగిపోయారు. ఆమెను అరెస్టు చేసేందుకు న్యాయస్థానం ఇదివరకే వారంట్ జారీ చేసింది. మనోరమ ఇంట్లో మద్యం సీసాలు లభించడంతో ఆమెను జెడియు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సాక్షాత్తూ బిహార్ సిఎం నితీష్‌కుమార్ ఇటీవల ప్రకటించారు.

05/17/2016 - 11:52

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఉదయం దిల్లీకి బయలుదేరారు. ఒకరోజు ముందుగానే అధికారుల బృందం సోమవారం నాడే దేశరాజధానికి చేరుకుంది. ఎపికి ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, కరవు సహాయం వంటి విషయాలపై ప్రధాని మోదీతో బాబు చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రధానికి ఇచ్చేందుకు నివేదికలను సిద్ధం చేశారు.

Pages