S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/30/2016 - 14:08

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మహానగరంలో ఆదివారం (మే 1) నుంచి పెట్రోల్, డీజిల్‌తో నడిచే టాక్సీలను నడపడానికి వీలు లేదని సుప్రీం కోర్టు శనివారం స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్‌కు బదులు గ్యాస్ (సిఎన్‌జి)తో నడిచేలా టాక్సీలను మార్పుచేసుకునేందుకు గడువును పెంచేందుకు అనుమతించే ప్రసక్తి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ గడువు శనివారంతో ముగిసింది.

04/30/2016 - 14:07

దిల్లీ: ప్రధాని మోదీతో పాటు బిజెపి నాయకులపై తరచూ విమర్శలు గుప్పించే దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇపుడు రైల్వేమంత్రి సురేష్ ప్రభుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రైల్వేమంత్రిని అభినందించారు. మహారాష్టల్రో తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న లాతూరు ప్రాంతానికి 11 సార్లు నీటిరైళ్లను పంపినందుకు కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు.

04/30/2016 - 14:05

దిల్లీ: సిబిఎస్‌ఇ సిలబస్, రాష్ట్రాల సిలబస్ వేర్వేరుగా ఉంటుంది గనుక ‘నీట్’ (మెడికల్ కోర్సులకు దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్)ను నిలిపివేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. సిలబస్ వేర్వేరుగా ఉన్నందున తాము స్వల్పకాలంలో ‘నీట్’కు సిద్ధం కాలేమని విద్యార్థులు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల వాదనను ధర్మాసనం త్రోసిపుచ్చింది.

04/30/2016 - 07:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కాంగ్రెస్ వల్లే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైపోయిందని టిడిపి ఎంపీ సిఎం రమేష్ ఆరోపించారు. విభజన పేరుతో ఏపిని నాశనం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పునర్మిస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్‌మెంబర్ బిల్లుపై జరిగిన చర్చలో పావల్గొంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

04/30/2016 - 07:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన 25 రహస్య ఫైళ్లను ప్రభుత్వం బయటపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ పేరుతో ఓ స్మారక మందిరం నిర్మించనున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది.

04/30/2016 - 07:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ-వాఘ జాయింట్ చెక్‌పోస్టు వద్ద 350 అడుగుల జాతీయ పతకాన్ని బిఎస్‌ఎఫ్ ఏర్పాటు చేయనుంది. అంతేకాదు పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి చూస్తే కనిపించేటంత ఎత్తులో త్రివర్ణ పతకం కొలువుతీరనుంది. అట్టారీ-వాఘ సరిహద్దులోనే బిఎస్‌ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు రిట్రీట్ నిర్వహిస్తుంటారు.

04/30/2016 - 07:11

హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో విద్యార్థులు అయోమయంలో పడగా, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలపై పూర్తిస్థాయి బెంచ్‌కు అప్పీలుకు వెళ్తామని ప్రకటించాయి.

04/30/2016 - 06:54

చెన్నై, ఏప్రిల్ 29: ఆడిటర్ రాధాకృష్ణన్‌పై దాడి కేసులోనుంచి కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి, మరో ఎనిమిది మంది నిర్దోషులుగా బయటపడ్డారు. 2002నాటి ఈ కేసులో హత్యాయత్నం సహా అన్ని అభియోగాల నుంచి వారు నిర్దోషులుగా బయటపడ్డారు. ప్రథమ అదనపు సెషన్స్ న్యాయమూర్తి పి.రాజమణిక్కం శుక్రవారం వెలువరించిన తన సంక్షిప్త తీర్పులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు.

04/30/2016 - 06:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదంటూ కాంగ్రెస్ సభ్యుడు జెడి శీలం ఎన్‌డిఏ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. శీలం శుక్రవారం రాజ్యసభలో కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన ఏపి విభజన చట్టం సవరణ బిల్లుపై మాట్లాడుతూ ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాదించిన బిజెపి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నారని నిలదీశారు.

04/30/2016 - 06:44

గాంధీనగర్, ఏప్రిల్ 29: రిజర్వేషన్ల కోసం గత కొంతకాలంగా పటేళ్లు సాగిస్తున్న ఉద్యమం దెబ్బకు దిగి వచ్చిన గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. ఆరులక్షలకన్నా తక్కువ కుటుంబ వార్షికాదాయం కలిగిన వారికి పది శాతం రిర్వేషన్లను కల్పిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Pages