S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/27/2016 - 05:38

కోల్‌కతా, ఏప్రిల్ 26: ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. గత ప్రభుత్వాలను ఆడిపోసుకోవడం ఇద్దరు నేతలకు అలవాటుగా మారిందని మంగళవారం ఆమె నిప్పులు చెరిగారు. చన్నింగ్‌లో ఎన్నికల సభలో మాట్లాడిన సోనియాగాంధీ‘గత ప్రభుత్వాలపై బురదచల్లడమే తప్ప వీరద్దరూ ప్రజలకు చేసిందేమీలేదు’అని ధ్వజమెత్తారు.

04/27/2016 - 05:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: చట్టమే గనుక అడ్డుపడకపోయి ఉంటే ‘్భరత్ మాతాకీ జై’ అని అనడానికి ఇష్టపడని వాళ్ల తలలు నరికి ఉండేవాడినని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై యోగా గురువు బాబా రాందేవ్ మాట మార్చారు.

04/27/2016 - 05:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: రాజ్యసభలో బుధవారం ఉల్లాసభరిత వాతావరణం చోటు చేసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి కొత్తగా ఎంపికైన సభ్యులు, ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అధికార, విపక్ష నేతల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది.

04/27/2016 - 05:33

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందేనని కోర్టు గట్టిగా చెప్పింది. కుటుంబ సభ్యుల ఆస్తులూ వెల్లడించాలని ఆదేశించింది.

04/27/2016 - 05:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన, జెఎన్‌యు విద్యార్థులను తొలగించిన అంశంపై మంగళవారం రాజ్యసభ దద్దరిల్లింది. ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖనీ చేస్తోందని, వర్శిటీల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద బైఠాయించటంతో రాజ్యసభ గందరగోళంలో పడింది. ఇతర కార్యక్రమాలు చేపట్టకుండానే బుధవారాని కి వాయిదా పడింది.

04/27/2016 - 04:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తేనే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు బలపడతాయని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది. ఇరు దేశాల శాంతిని కబళిస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో రెండోమాటకు తావేలేదని స్పష్టం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో ఉగ్రవాదం, పఠాన్‌కోట్ తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

04/27/2016 - 04:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సిఎం చంద్రబాబు నాయకత్వంలో రాజకీయ అవినీతి సాగుతోందంటూ ప్రతిపక్ష నాయకుడు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. కోట్లు ప్రలోభపెట్టి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులకు ఫిర్యాదు చేశారు.

04/26/2016 - 17:56

దిల్లీ: కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎక్కడున్నాడో వివరాలు కచ్చితంగా చెప్పితీరాలని అతని లాయర్‌ను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. మాల్యా కేసుపై విచారిస్తున్న ధర్మాసనం కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసింది. మాల్యాకు దేశవిదేశాల్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయన్న వివరాలను సీల్డుకవర్‌లో బ్యాంకులకు సమర్పించాలని కోర్టు పేర్కొంది.

04/26/2016 - 17:54

దిల్లీ: జ్వరం, ఛాతీలో నొప్పి కారణంగా సోమవారం ఇక్కడి ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు మంగళవారం తెలిపారు. గుండె వ్యాధుల విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.

04/26/2016 - 17:13

దిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించి రెండు కీలకమైన దస్త్రాలను జపాన్‌ విడుదల చేయనుంది. మరో మూడు దస్త్రాల విడుదలపై ఆ దేశం ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో తెలిపారు. జపాన్‌ వద్ద ఉన్న ఐదు దస్త్రాలు చాలా కీలకమైనవని, మిగతా వాటిని కూడా ఆ దేశం విడుదల చేస్తుందన్న నమ్మకం తమకుందని మంత్రి తెలిపారు.

Pages