S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/26/2016 - 16:58

ముంబై: పలు పేలుళ్లతో సంబంధం ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది జైనుల్ అబేదిన్‌ను మహారాష్ట్ర ఏటీఎస్, గుజరాత్, కర్ణాటక, ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్, జైపూర్, బెంగళూరుల్లో జరిగిన పేలుళ్లతో జైనుల్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు. ముంబై 13/7 పేలుళ్లకు కూడా జైనుల్ సూత్రధారి అని తెలిపారు.

04/26/2016 - 15:59

దిల్లీ: పాలేరు ఉప ఎన్నికలో ఇవిఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ వినియోగించేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం ఇక్కడ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నదీమ్‌జైదీకి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఖమ్మంలో తెరాస ప్లీనరీని నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.

04/26/2016 - 14:47

దిల్లీ: భారీగా డబ్బు లేదా మంత్రి పదవులను ఎరగా వేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. ‘సేవ్ డమొక్రసీ’ యాత్ర సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ పలువురు రాజకీయ నేతలను కలిసి ఎపిలో ఫిరాయింపురాజకీయాలపై ఫిర్యాదు చేశారు.

04/26/2016 - 14:46

దిల్లీ: రాష్టప్రతి కోటాలో నియమితులైన రాజ్యసభ సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్టప్రతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హమీద్ అన్సారీ కొత్తగా నామినేట్ అయిన మేరీ కోమ్, సుబ్రహ్మణ్య స్వామి, స్వపన్‌దాస్ గుప్తా, నరేంద్ర జాదవ్, సుఖ్‌దేవ్ సింగ్‌లచేత ప్రమాణం చేయించారు.

04/26/2016 - 12:15

దిల్లీ: వాయిదా తీర్మానాలను అనుమతించాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టడంతో మంగళవారం ఉదయం రాజ్యసభలో వాతావరణం వేడెక్కింది. వాయిదా తీర్మానాలను తిరస్కరించి, ప్రశ్నోత్తరాలను డిప్యూటీ చైర్మన్ కురియన్ చేపట్టడంతో విపక్ష ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఎంతగా వారించినా వారు వినకపోవడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

04/26/2016 - 12:13

దిల్లీ: లోక్‌సభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వివిధ వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. శ్రీనగర్ ‘నిట్’ పరిస్థితులపై కాంగ్రెస్, దుర్భిక్షంపై ఆర్‌జెడి, కేరళలో పుట్టంగళ్ ఆలయలో ఇటీవలి అగ్నిప్రమాదంపై సిపిఎం సభ్యులు వాయిదా తీర్మానాలను ఇచ్చారు.

04/26/2016 - 12:12

దిల్లీ: దేశ రాజధానిలోని ఫిక్కీ ఆడిటోరియంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించి నేచురల్ హిస్టరీ మ్యూజియం పూర్తిగా దగ్ధమైంది. భవనంలోని ఆరో అంతస్థులో తెల్లవారు జామున మంటలు వ్యాపించాయి. 35 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పుతుండగా గాయపడిన ఆరుగురు అగ్నిమాపక సిబ్బందిని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

04/26/2016 - 12:11

దిల్లీ: ఎపిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ‘సేవ్ డమొక్రసీ’ పేరుతో దిల్లీ యాత్ర చేపట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఇక్కడ ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ను కలిశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిసూత తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని ఆయన పవార్‌కు వివరించారు. జగన్ ఈరోజు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం.

04/26/2016 - 06:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైకాపా అధ్యక్షుడు జగన్ నేతృత్వంలోని వైకాపా నాయకుల బృందం కేంద్ర పభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నేతలను కలవనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడియూ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో మంగళవారం భేటీ అవుతుంది.

04/26/2016 - 05:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఇపిఎఫ్‌ఓ ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరిస్తూ పిఎఫ్ వడ్డీ రేటును 2015-16 సంవత్సరానికి గాను 8.7శాతంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పిఎఫ్ వడ్డీ రేటును 8.8శాతంగా కొనసాగించాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఉన్న ఇపిఎఫ్‌ఓ ట్రస్టీల బోర్డు సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ 8.7శాతం వడ్డీ రేటునే ఆమోదించింది.

Pages