S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/26/2016 - 05:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఎన్టీయే ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సోమవారం మొదలైన పార్లమెంటులో కాంగ్రె స్ పెద్దపెట్టున దుమారం రేపింది. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద బైటాయిస్తే, రాజ్యసభలో మాత్రం పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో ఉభయ సభల్లోని కార్యక్రమాలు స్థంభించాయి.

04/26/2016 - 05:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కేంద్ర ప్రభుత్వోద్యోగాలు వెల్లువెత్తను న్నాయ. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వం 2016-17 బడ్జెట్ అంచనాల్లో 2017 నాటికి సుమారు 2.18 లక్షల ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొంది. 2015 నాటికి 33.05 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కొత్తగా 5,635 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారు.

04/26/2016 - 05:01

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కర్మాగారాల్లో ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రమాదాలను అదుపుచేసేందుకు కర్మాగారాల చట్టాన్ని సవరించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని సోమవారం ఇక్కడ వెల్లడించారు.

04/26/2016 - 04:40

సూళ్లూరుపేట, ఏప్రిల్ 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)కేంద్రం నుండి ఈనెల 28న పిఎస్‌ఎల్‌వి-సి33 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో మూహుర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రీ కౌంట్‌డౌన్, రిహార్సల్స్ సోమవారం శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు.

04/26/2016 - 02:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పఠాన్‌కోట్‌పై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో అసలు భారత్-పాక్‌ల మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉందా అన్న అనుమానాల నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి.

04/26/2016 - 02:10

ముంబయి, ఏప్రిల్ 25: డాన్స్‌బార్‌లు ఏర్పాట్లుపై మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డాన్స్‌బార్‌లకు అనుమతులు మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను కోర్టు తప్పుపట్టింది. విద్యా సంస్థలకు ఒక కిలోమీటర్ అవతలే డాన్స్‌బార్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

04/26/2016 - 02:07

నైనితాల్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హరీశ్ రావత్‌ను తొలగించాలనే తాము కోరాము తప్ప కాంగ్రెస్ పార్టీని వీడిపోలేదని స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం రాష్ట్ర హైకోర్టుకు చెప్పారు. హరీశ్ రావత్ ప్రభుత్వం పట్ల తాము అసమ్మతిని వ్యక్తం చేశామని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించలేదని వారు వివరించారు.

04/26/2016 - 01:59

చెన్నై, ఏప్రిల్ 25: తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని ద్రవిడ మునే్నట్ర కజగం అధినేత ఎం.కరుణానిధి ప్రకటించారు. మద్యపానం పట్ల ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని తాము అధికారంలోకి వచ్చిన తరువాత మొద టి సంతకం మద్యనిషేధ ఫైలుపైనే పెడతానని ఎన్నికల ప్రచార సభలో కరుణానిధి పేర్కొన్నారు.

04/26/2016 - 01:59

ముంబయి, ఏప్రిల్ 25: మహారాష్ట్రంలోని మాలేగావ్‌లో 2006 సెప్టెంబర్‌లో జరిగిన పేలుళ్ల కేసులో తొమ్మిది మంది ముస్లిం యువకులపై దాఖలైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈకేసుకు సంబంధించి నిందితులపై సాక్ష్యాధారాలు రుజువుచేయనందున సెష న్స్ జడ్జి వివి పాటిల్ తొమ్మిది మందిని నిర్దోషులుగా తీర్పునిచ్చారు. మాలేగావ్‌లో జరిగిన పేలుళ్ల ఘటనలో 37 మంది మృతి చెందారు.

04/26/2016 - 01:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సివిల్ సర్వీస్-2016 పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలను యుపిఎస్‌సి వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. వాస్తవానికి శనివారమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.

Pages