S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/11/2016 - 18:15

గౌహతి: అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి కింద పడడంతో 11 మంది మరణించారు. మరో ఇరవైమంది గాయపడ్డారు. పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బుల్లెట్లు తగిలి విద్యుత్ తీగలు తెగి కిందకు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం.

04/11/2016 - 18:15

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆలయాల్లో బాణసంచాను పూర్తిగా నిషేధించాలని ఆధ్మాత్మిక గురువు మాతా అమృతానందమయి ప్రభుత్వానికి సూచించారు. కేరళలోని పుట్టింగళ్ ఆలయంలో బాణసంచా పేలి 115 మంది మరణించడం దారుణమన్నారు. మనుషులు తమ సంతోషం కోసమే బాణసంచా కాలుస్తారని , దేవుడి ఆనందం కోసం కాదని ఆమె అన్నారు. దేవుడికి ఎలాంటి చెవుడు లేదు గనుక బాణసంచాను నిషేధించడం సరైన చర్య అని ఆమె వ్యాఖ్యానించారు.

04/11/2016 - 18:14

శ్రీనగర్: ఇక్కడి నిట్‌లో ఇంకా ఆందోళనకర వాతావరణం కొనసాగుతూనే ఉంది. సోమవారం జరిగిన వార్షిక పరీక్షలకు స్థానికేతర విద్యార్థులు హాజరు కాలేదు. తమపై దాడులు జరుగుతున్నా నిట్ అధికారులు స్పందించడం లేదని, తమను వేరే రాష్ట్రానికి పంపాలని స్థానిక విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాడుల భయంతో ఇప్పటికే కొంతమంది స్థానికేతర విద్యార్థులు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు.

04/11/2016 - 18:14

బాగ్‌పట్: కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఆ గ్రామంలోని వారంతా సామూహికంగా ప్రమాణం చేశారు. యుపిలోని బాగ్‌పట్ జిల్లా బావ్లి పంచాయతీలో ఈ మేరకు సోమవారం గ్రామస్థులంతా సమావేశమై వరకట్నాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో అమ్మాయిలెవరూ జీన్స్, బిగుతు దుస్తులు వేసుకోరాదని, ఆడపిల్లలు పుట్టకుండా భ్రూణహత్యలకు పాల్పడేవారిని గ్రామం నుంచి బహిష్కరిస్తామని పెద్దలు తీర్మానించారు.

04/11/2016 - 18:13

దిల్లీ: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కంపెనీలో భారీగా అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణకు సిబిఐని ఆదేశించాలంటూ వినోద్‌కుమార్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై విచారణకు తాము ఆదేశాలు ఇవ్వలేమని, పిటిషనర్ సరైన కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం పేర్కొంది.

04/11/2016 - 16:29

దిల్లీ: భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకూ పురుషులతో పాటు అన్ని హక్కులు ఉన్నాయని, అయితే ఆలయాల్లో మహిళల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంలో విచారణ మొదలైంది.

04/11/2016 - 16:29

కొల్లం: కేరళలోని కొల్లం జిల్లాలో పుట్టింగళ్ ఆలయం వద్ద బాణసంచా పేలుడులో గాయపడిన వారికి ఆరెస్సెస్ కార్యకర్తలు అండగా నిలిచారు. క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు వందల సంఖ్యలో ఆరెస్సెస్ కార్యకర్తలు త్రివేండ్రం వైద్యకళాశాల వద్దకు తరలివచ్చారు. బాధితులకు మందులు,మంచినీళ్లు ఇస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఆరెస్సెస్ కార్యకర్తలు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.

04/11/2016 - 16:27

కామ్‌రూప్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా కామ్‌రూప్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద జనాన్ని చెదరగొట్టేందుకు ఓ జవాను గాలిలోకి కాల్పులు జరిపాడు. ఓటు వేసిన ఓ మహిళ తిరిగి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని అక్కడే ఉన్న జవాను అడ్డుకున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఉండిపోయిన బిడ్డను తెచ్చుకునేందుకు ఆమె వెళ్లగా జవాను ఘర్షణ పడ్డాడు. దీంతో స్థానికులు గుమికూడి జవానుతో వాదనకు దిగారు.

04/11/2016 - 16:25

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగళ్ ఆలయం వద్ద మూడు కార్లలో పేలుడు పదార్థాలున్నట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు బాంబు స్క్వాడ్‌ను రప్పించారు.

04/11/2016 - 16:24

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగళ్ ఆలయం వద్ద బాణసంచా ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 112కు చేరింది. సుమారు 500 మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. బాణసంచా పోటీలను నిషేధించినప్పటికీ ఎవరూ ఖాతరు చేయకపోవడం వల్లే ఈ దారుణ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ ప్రాంతంలో విషాదం అలముకుంది.

Pages