S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/25/2016 - 17:55

తిరువనంతపురం: కేరళ సున్నీ బోర్డు నిర్ణయం ఫలితంగా ఆ రాష్ట్రంలో మహిళలు సోమవారం నాడు పలుచోట్ల మసీదుల్లో ప్రవేశించి ప్రార్ధనలు చేశారు. చాలాకాలంగా తాము ఈరోజు కోసమే ఎదురుచూశామంటున్న ముస్లిం మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది.

04/25/2016 - 16:21

దిల్లీ: ఉత్తరాఖండ్ పరిస్థితులపై చర్చకు సిద్ధమేనని సోమవారం లోక్‌సభలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనకు సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, సరైన రూలింగ్ ప్రకారం చర్చ జరగాల్సి ఉందని అధికారపక్ష సభ్యులు అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరించిందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.

04/25/2016 - 16:20

చెన్నై: డిఎంకె అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి తమిళనాడు ఎన్నికల్లో తిరువారూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారం నామినేషన్ వేశారు. 93 ఏళ్ల ఆయన తిరిగి రాష్ట్రంలో డిఎంకె పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకండా ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన కుమారుడు స్టాలిన్ కొలతూర్ నుంచి పోటీ చేసేందుకు ఈనెల 27న నామినేషన్ వేస్తారని డిఎంకె తెలిపింది.

04/25/2016 - 16:18

దిల్లీ: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న నినాదంతో యాత్ర చేపట్టిన వైకాపా అధినేత జగన్ తన అనుచరులతో సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. ఎపిలో వైకాపా ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొంటూ టిడిపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు రాష్టప్రతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలను కలిసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

04/25/2016 - 16:18

దిల్లీ: ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం ఆందోళనలు చేస్తూ విజయం సాధిస్తున్న తృప్తి దేశాయ్ ఇపుడు ఆరెస్సెస్‌పై తన దృష్టి సారించారు. హిందూత్వ ప్రాతిపదికగా కొనసాగుతున్న ఆరెస్సెస్‌లో మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ కార్యకలాపాల్లో మహిళలకు సైతం భాగస్వామ్యం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆమె ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్‌కు తాజాగా లేఖ రాశారు.

04/25/2016 - 14:04

చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి జయలలిత సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు అసెంబ్లీలోని 234 సీట్లకు నామినేషన్ల పర్వం కోలాహలంగా కొనసాగుతోంది.

04/25/2016 - 14:04

దిల్లీ: ఎప్పుడూ విచిత్ర వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే టిడిపి ఎంపీ, నటుడు శివప్రసాద్ ఈసారి కుచేలుడి వేషంలో పార్లమెంటు వద్ద దర్శనమిచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆయన సోమవారం కుచేలుడి వేషధారణతో పార్లమెంటుకు వచ్చారు. ఎపికి ప్రత్యేక హోదా, తగినన్ని నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

04/25/2016 - 14:04

దిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనపై ఉభయసభల్లో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు.

04/25/2016 - 14:03

దిల్లీ: ఓ ఇంట్లో దుండగులు ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లిన పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన నోయిడా (యుపి)లో సోమవారం జరిగింది. తాము ఉన్న ఇంటి వద్దకు పోలీసు అధికారి వచ్చారని తెలిసి దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. తూటాలు తగిలి ఆ అధికారి మరణించగా, ముగ్గురు దుండగులు పరారయ్యారు.

04/25/2016 - 12:33

దిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎంపీలు, ప్రముఖ నేతలకు తొలుత సంతాపం ప్రకటించారు. ప్రస్తుత సమావేశాల్లో ఉభయ సభల్లో మొత్తం 24 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కీలకమైన జిఎస్‌టి బిల్లు కూడా ఉంది.

Pages