S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/06/2016 - 16:23

ముంబయి: తమ కుమర్తె జీవితాన్ని నాశనం చేసిన బోయ్‌ఫ్రెండ్ రాహుల్‌ను ఉరితీయాలని లేదా జీవితాంతం జైల్లో పెట్టాలని ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యూష ఆత్మశాంతి కోసం బుధవారం ప్రార్ధనలు జరిపిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. డబ్బు కోసం ప్రత్యూషను శారీరకంగా, మానసికంగా వేధించి చివరికి ఆమె ఆత్మహత్యకు రాహుల్ కారకుడయ్యాడని వారు తెలిపారు.

04/06/2016 - 14:13

ముంబయి: ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి ప్రత్యూష (బాలికా వధు ఫేమ్)ను ఆమె బోయ్‌ఫ్రెండ్ రాహుల్ శారీరక, మానసిక వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు నమోదు చేశారు. ప్రత్యూష తల్లి ఇచ్చిన తాజా ఫిర్యాదుపై కేసు నమోదు చేశాక రాహుల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వేచి చూస్తున్నారు. అనారోగ్యానికి లోనైన రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

04/06/2016 - 14:12

దిల్లీ: శ్రీనగర్‌లోని ఎన్‌ఐటిలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేడు భారత్‌లో విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలే విద్యాసంస్థల్లో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని ఆయన ఆరోపించారు.

04/06/2016 - 14:12

ముంబయి: 2002, 2003 సంవత్సరాల్లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 12 మంది మరణానికి కారకులైన వారిలో అన్సారీ, వాహిబ్, ఫర్షాన్ అనే నిందితులకు ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. మరో ముగ్గురికి పదేసి ఏళ్ల చొప్పున జైలుశిక్ష వేశారు. మొత్తం పదిమంది నిందితుల్లో ఆరుగురికి శిక్షలు ఖరారు చేయగా, మిగతా నలుగురినీ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

04/06/2016 - 12:19

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరి రెండురోజులు కాకముందే అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా తనకు ప్రాధాన్యత లేని సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి సజ్జాద్ ఘనీ బుధవారం రాజీనామా చేశారు. తనకు కీలకమైన వైద్య శాఖ దక్కుతుందని ఆశించి తీరని నిరాశకు గురైనట్లు ఆయన చెబుతున్నారు.

04/06/2016 - 08:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు 3స్టాండప్ ఇండియా2 పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగార్థులు ఉపాధి అవకాశాలను సృష్టించే వారుగా ఎదిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు.

04/06/2016 - 08:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: సంచలనం సృష్టించిన ‘పనామా’ డాక్యుమెంట్ల స్కాంలో తన పేరు ప్రతిష్ఠలను దుర్వినియోగం చేశారని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మంగళవారం ఖండించారు. పనామా పత్రాల లీకేజీ వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖుల జాబితాలో అమితాబ్ కుటుంబం పేరు ప్రముఖంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘నా పేరును తప్పుగా వాడారని నేను భావిస్తున్నాను. నేను అన్ని పన్నులను సక్రమంగా చెల్లించాను.

04/06/2016 - 08:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా మూలంగా దేశంలోని లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నిండుతోందని ఆయన ప్రశంసించారు.

04/06/2016 - 08:02

జమ్మూ, ఏప్రిల్ 5: పనితీరులో నూ, సమర్ధవంతమైన పాలన అం దించడంతో మంత్రులు ముందుండాలని, లేపిక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కొత్త కేబినెట్‌కు దిశానిర్దేశం చేశారు. కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సోమవారం రాత్రి తొలి మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఉద్ఘాటించారు.

04/06/2016 - 08:02

నల్బరి (అస్సాం), ఏప్రిల్ 5: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ప్రశ్నించడాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎదురుదాడికి దిగారు. ఇక్కడ జరిగేది లోక్‌సభ ఎన్నికలు కావనీ, అస్సాం అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చి, మోదీ ఏం చేశారో చెప్పాలనడంలో అర్థం లేదని అమిత్ షా పేర్కొన్నారు.

Pages