S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/24/2016 - 06:12

ముంబయి, ఏప్రిల్ 23: భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తీ దేశాయ్ గనుక హాజీ అలీ దర్గాకు యాత్ర చేపడితే ఆమెకు చెప్పులతో స్వాగతం పలుకుతామని స్థానిక శివసేన నాయకుడొకరు చేసిన ప్రకటన వివాదానికి కారణమైంది. అయితే స్ర్తిపురుష సమానత్వం కోసం పారాడుతున్న తృప్తీ దేశాయ్ మాత్రం తాను ఈ నెల 28న యథాప్రకారం హాజి అలీ దర్గా యాత్ర చేపడతానని స్పష్టం చేశారు.

04/24/2016 - 06:11

బాలియా(యూపి), ఏప్రిల్ 23: ఈ ఆర్థిక సంవత్సరం 10వేల మంది ఎల్‌పిజి పంపిణీదారులను నియమించనున్నట్టు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ‘దేశంలో ప్రస్తుతం 18వేల పంపిణీ దారులున్నారు.

04/24/2016 - 06:09

జైపూర్, ఏప్రిల్ 23: కొన్ని రాష్ట్రాల్లో కరవు పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ఏడాది అవసరాలకు తగినన్ని అహార ధాన్యాల నిల్వలు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) దగ్గర ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. దేశంలో 549 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం కాగా, 600 లక్షల టన్నుల ఆహార దాన్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని పాశ్వాన్ శనివారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు.

04/24/2016 - 06:09

నైనితాల్, ఏప్రిల్ 23: ఉత్తరాఖండ్‌లో అనర్హత వేటుపడిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని రాష్ట్ర హైకోర్టును అసెంబ్లీ స్పీకర్ శనివారం కోరారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని, అం దువల్ల వారు శిక్షార్హులని స్పీకర్ పేర్కొన్నారు.

04/24/2016 - 06:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఈ అంశంపై రాజ్యసభలో చర్చించి, రాష్టప్రతి పాలనకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కోరు తూ నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి ఉత్తరాఖండ్ అంశాన్ని చర్చకు చేపట్టాలని నోటీసులో కోరారు.

04/24/2016 - 06:06

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశవ్యాప్తంగా ఉన్న 20కోట్ల చిన్నారుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాఠశాలల్లో ఒక చైల్డ్‌ట్రాకింగ్ సిస్టమ్‌ను తీసుకువస్తోంది. వారు ఒక తరగతినుంచి మరో తరగతికి పురోగతిని గమనించడానికి, అలాగే డ్రాపవుట్లను (మధ్యలో బడి మానేసే వారిని) గుర్తించడం కోసం ఈ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు.

04/24/2016 - 06:05

నాగ్‌పూర్, ఏప్రిల్ 23: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రమాదాలు సగానికి సగం తగ్గించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు శనివారం ఆయన తెలిపారు. ‘దురదృష్టవశాత్తు దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం 1.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు’అని అన్నారు.

04/24/2016 - 06:04

ముంబయి, ఏప్రిల్ 23: భారత దేశ ప్రాచీన సంస్కృతిని పరిరక్షించి ప్రదర్శించాల్సిన అవసరం ఎంతయినా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటూ, సుసంపన్నమైన భారతీయ చరిత్ర గురించి తెలియని వారికి వర్తమానం ఉంటే ఉండవచ్చునేమో కానీ భవిష్యత్తు మాత్రం లేదని అన్నారు. ‘మన సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే ప్రాచీన నాణేలు, నోట్లు, తాజాగా వచ్చిన స్టాంప్‌లను అర్థం చేసుకుంటే మంచిది.

04/24/2016 - 06:03

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 23: పర్యావరణ పరిరక్షణకు కుదిరిన చరిత్రాత్మక పారిస్ ఒప్పందం అమలుకు ప్రపంచ దేశాలు చేపట్టే కార్యాచరణ ప్రణాళిక ప్రపంచంలోని పేదలకు పర్యావరణ న్యాయం లభించేలా చూడడంతో పాటుగా ప్రకృతి వనరుల వినియోగంలో నిలకడతనాన్ని తీసుకు రావడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని భారత్ సూచించింది.

04/24/2016 - 01:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలోని వివిధ రాష్ట్రాలు వర్షాభావంతో తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఓ ప్రైవేటు సభ్యుడి బిల్లును పరిశీలించాల్సిందిగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ బిల్లు దేశంలోని రైతులకు గణనీయంగా రక్షణాత్మక చర్యలు కల్పిస్తుందని ప్రణబ్ అభిప్రాయపడ్డారు.

Pages