S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/24/2016 - 01:16

న్యూఢిల్లీ, జనవరి 23: తైవాన్ విమాన ప్రమాదంలో మృతి చెందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మాన్ని తీసుకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని 1995 ఫిబ్రవరిలో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేతాజీ చితాభస్మం టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉంది. ప్రధాని విడుదల చేసిన డిజిటల్ రూపంలోని వంద ఫైళ్లలో ఈ డాక్యుమెంట్ కూడా ఉంది.

01/24/2016 - 01:16

కోల్‌కతా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితిని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన ముని మేనల్లుడు చంద్రబోస్ శనివారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

01/24/2016 - 01:15

కోల్‌కతా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన వంద రహస్య పత్రాలను బహిరంగ పర్చడం పట్ల ఆయన సన్నిహిత బంధువు కృష్ణబోస్ శనివారం హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పత్రాలను గనుక ఇంతకుముందే బహిరంగపరిచి ఉంటే నేతాజీ మృతికి సంబంధించి వివాదమే తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ‘మాకు సంతోషంగా ఉంది. ఈ పత్రాలను ఇంతకుముందే బహిరంగపరిచి ఉంటే ఎలాంటి ఊహాగానాలు ఉండేవి కావు.

01/24/2016 - 01:14

న్యూఢిల్లీ, జనవరి 23: ముంబయి వెళ్లాల్సిన గో ఎయిర్ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో నాగ్‌పూర్‌కు మళ్లించారు. 150 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌లో బయలుదేరిన గో ఎయిర్ జి8 243 విమానం 9.29కి నాగ్‌పూర్‌లో సురక్షితంగా దిగింది. విమానం భువనేశ్వర్‌లో ఉదయం 8.20కి బయలుదేరింది. విమానంలో బాంబు పెట్టినట్టు వచ్చిన ఫోన్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు.

01/24/2016 - 01:13

పనాజి, జనవరి 23: ఐఎస్‌ఐఎస్ నుంచి బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తామని, ఈ మేరకు ఆయనను కోరడం జరిగిందని గోవా ఎస్‌పి బోస్కో జార్జ్ శనివారం విలేఖరులకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని, పారికర్‌ను చంపుతామంటూ జనవరి 13న ఐఎస్‌ఐఎస్ పేరుతో ఒక లేఖ వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

01/24/2016 - 01:13

బెంగళూరు/న్యూఢిల్లీ, జనవరి 23: కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుపుతూ ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఉత్తర కన్నడ తీరప్రాంత పట్టణమైన భత్కల్‌పై మరోసారి దృష్టి కేంద్రీకరించింది.

01/24/2016 - 01:34

రాంచి, జనవరి 23: దేశంలోనే అతి పెద్దదైన, పొడవైన మువ్వనె్నల పతాకాన్ని శనివారం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాంచిలోని మహారీ మందిర్‌లో ఆవిష్కరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా అతి పెద్దదైన, పొడవైన జెండాను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పారికర్ తెలిపారు. ఈ జెండా ఎత్తు 66 అడుగులు, వెడల్పు 99 అడుగులు ఉండగా, దీనిని 293 అడుగుల పొడవైన కర్రకు అమర్చారు.

01/24/2016 - 03:08

మహోబా (ఉత్తరప్రదేశ్), జనవరి 23: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కరవు పీడిత ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌లో శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ కేవలం పారిశ్రామికవేత్తల గురించే కాకుండా రైతులు, కార్మికు గురించి కూడా ఆలోచించాలని, వెనుకబడిన ప్రాంతాలకు మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని రాహుల్ హితవు పలికారు.

01/24/2016 - 01:10

చండీగఢ్, జనవరి 23: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ భారత్‌లో జరుపనున్న మూడు రోజుల పర్యటన ఆదివారం ప్రారంభం కానుంది. ‘సుందర నగరం’ చండీగఢ్ నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. చండీగఢ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి వాణిజ్య సమావేశంలో పాల్గొననున్న హోలాన్ వివిధ ముఖ్య ప్రదేశాలను సందర్శించనున్నారు.

01/24/2016 - 00:37

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యపై సంతాపం తెలిపేందుకు ఐదు రోజుల సమయం ఎందుకు పట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ఆనంద్ శర్మ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రోహిత్ తల్లికి కలిగిన బాధను అర్థం చేసుకునేందుకు ఇంత సమయం పట్టిందా? అని నిలదీశారు.

Pages