S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/02/2016 - 02:54

జమ్మూ/శ్రీనగర్, ఫిబ్రవరి 1: జమ్మూ-కాశ్మీరులో ప్రభుత్వ ఏర్పాటుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), బిజెపిల వైఖరి ఏమిటో వివరించాలని, దీనిపై సంప్రదింపులు జరిపేందుకు మంగళవారం తనతో భేటీకి రావాలని రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్.వోహ్రా ఇరు పార్టీల అధినేతలను కోరారు.

02/02/2016 - 02:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: తీరప్రాంత రక్షణలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ అంకితభావంతో పనిచేస్తోంది. పొరుగుదేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా తిప్పికొడుతూ జాతి ప్రయోజనాల కోసం శ్లాఘనీయమైన పాత్ర పోషిస్తోంది. నాలుగు దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ జాతి ప్రయోజనానలు కాపాడడంతో ముందుంటోంది.

02/02/2016 - 02:51

ముంబయి, ఫిబ్రవరి 1: ప్రైవేటు సెక్టారులో కూడా రిజర్వేషన్లు అమలుచేయాలని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ప్రభుత్వ ఫలాలు అందుకుంటున్న ప్రైవేటు కంపెనీలు దళితులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం వుందని తమ పార్టీ అభిప్రాయపడుతోందని ఆయన చెప్పారు. అలాగే రానున్న బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన షెడ్యూలు కులాలు, తెగల వారికి తగినన్ని నిధులు కేటాయించాలని అన్నారు.

02/02/2016 - 00:35

ముంబయి, ఫిబ్రవరి 1: మహారాష్టల్రో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. పుణేలోని ఇనామ్‌దార్ కళాశాల నుంచి విహారయాత్రకు వచ్చిన 13 మంది విద్యార్థులు సోమవారం సాయంత్రం రాయ్‌గఢ్ జిల్లాలోని మురద్-జంజీరా బీచ్‌లో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పది మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు.

02/02/2016 - 00:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రాజకీయ అనిశ్చితిలో చిక్కుకున్న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడానికి సంబంధించిన కేసుల్లో ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవాకు నోటీసు ఇవ్వడం తప్పేనని సుప్రీం కోర్టు అంగీకరించింది. కోర్టు వ్యాజ్యాల విషయంలో గవర్నర్లకు పూర్తి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

02/01/2016 - 18:29

ముంబయి: మహారాష్టల్రోని రాయగఢ్ మురుద్ సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో 11 మంది నీట మునిగి మరణించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సముద్రంలోకి దిగారు. నలుగురిని స్థానికులు కాపాడారు. మృతుల్లో 8 మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

02/01/2016 - 07:12

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలోని యాభై శాతం మంది రైతులను ప్రధాన మంత్రి బీమా పథకంలో చేర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, దీన్ని సాకారం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంకుర పరిశ్రమలు కేవలం ఐటి సంస్థలకే కాదు ఇతర పరిశ్రమలకు కూడా వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. నరేంద్ర మోదీ ఆదివారం తన పదహారవ మనసులోని మాట ప్రసంగాన్ని ఆకాశవాణిలో చేస్తూ ఈ విషయాలు చెప్పారు.

02/01/2016 - 07:10

శ్రీనగర్, జనవరి 31: జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు ఎలాంటి విముఖత లేదని, అయితే దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ విజన్‌ను పూర్తి చేయడానికి మిత్రపక్షమైన బిజెపి నుంచి గట్టి హామీ లభించేంత వరకు ఇది సాధ్యం కాదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆదివారం తన పార్టీ కోర్ గ్రూప్‌కు చెప్పారు.

02/01/2016 - 07:08

న్యూఢిల్లీ, జనవరి 31: దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకులను సృష్టిస్తోందని బిజెపి ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. విపక్షం అడుగడుగునా అడ్డుతుగులుతున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో సమర్థవంతంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆ పార్టీ పేర్కొంది.

02/01/2016 - 07:06

న్యూఢిల్లీ, జనవరి 31: ఇంటర్నెట్ తటస్థత (నెట్ న్యూట్రాలిటి) అంశంపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తరచుగా చర్చల నెపంతో ఇంటర్నెట్ తటస్థతపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Pages