S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/22/2016 - 05:05

సూళ్లూరుపేట, ఏప్రిల్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 28న పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ద్వారా 1425 కిలోల బరువు గల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

04/22/2016 - 02:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు స్వచ్ఛ విద్యాలయ అవార్డు లభించింది. గురువారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ జిల్లా కలెక్టర్ కోలా శశిధర్ ఈ అవార్డును అందుకున్నారు. సివిల్ సర్వీస్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, దేశంలోని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

04/22/2016 - 01:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ‘ఉత్తరాఖండ్’ తీర్పుపై భారతీయ జనతాపార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. హరీశ్‌రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించటంతో పాటు, రాష్టప్రతి పాలన విధింపుపై ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం ఆందోళన చెందింది. హైకోర్టు తీర్పుపై శుక్రవారం సుప్రీం కోర్టులో సవాలు చేయాలని పార్టీ గురువారం పొద్దుపోయాక నిర్ణయం తీసుకుంది.

04/22/2016 - 01:38

నైనితాల్, ఏప్రిల్ 21: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధింపు వ్యవహారంలో మోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 27న హరీశ్ రావత్ సర్కారును రద్దు చేసి రాష్టప్రతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం రద్దు చేసింది. హరీశ్‌రావత్ ప్రభుత్వాన్ని తక్షణం పునరుద్ధరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

04/21/2016 - 18:05

దిల్లీ: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయకుండా ఇకనైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటూ ప్రధాని మోదీకి దిల్లీ సిఎం కేజ్రీవాల్ సూచించారు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యవాదులకు గొప్ప విజయమని కేజ్రీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అడ్డుతగిలితే ప్రజాస్వామ్యానికి మనుగడ లేదన్నారు.

04/21/2016 - 18:05

దిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగవేతకు సంబంధించి ఎట్టకేలకు కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తన ఆస్తుల వివరాలు అడిగే హక్కు బ్యాంకులకు లేదని ఆయన పేర్కొన్నారు. విచారణకు హాజరుకావాలని ఈడీ పంపిన సమన్లను పట్టించుకోని మాల్యా గడువు ముగిసే రోజున సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

04/21/2016 - 18:03

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి పోసిందని మాజీ సిఎం హరీష్ రావత్ (కాంగ్రెస్) అన్నారు. రాష్టప్రతికి తప్పుడు సలహాలిచ్చి ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించినందుకు ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా భారత జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

04/21/2016 - 16:45

దిల్లీ: ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ విదేశాల నుంచి గురువారం దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నపుడు క్రీడాభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. దేశ ప్రజల ఆకాంక్షల మేరకు రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది. జిమ్నాస్టిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

04/21/2016 - 16:44

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్‌లోని హైకోర్టు ధర్మాసనం గురువారం చారిత్రక తీర్పు ఇచ్చింది. రాష్టప్రతి పాలన విధించడంలో కేంద్ర ప్రభుత్వం తీరును కోర్టు తప్పు పట్టింది. రాష్టప్రతి పాలన రద్దు కావడంతో మాజీ ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌కు ఈ నెల 29న అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం కల్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

04/21/2016 - 16:40

దిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసే దిశగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. మాల్యా, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలు ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. అయినప్పటికీ మాల్యా నుంచి ఎలాంటి స్పందన లేనందున ఇక ఆయన ఆస్తులను జప్తు చేయాలన్న ఆలోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది.

Pages