S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/21/2016 - 09:13

చెన్నై, ఏప్రిల్ 20: తమిళనాట డిఎండికె అధ్యక్షుడు కెప్టెన్ విజయ్‌కాంత్ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం సద్దుమణగముందే బుధవారం విలేఖరులపై వీరంగా చేశారు. సేలంలో ఎన్నికల సభలో విలేఖరులపై రెచ్చిపోయిన విజయ్‌కాంత్ చెంప వాయిస్తానని హెచ్చరించాడు. డిఎండికె, పిడబ్ల్యూఎఫ్ కూటమి సిఎం అభ్యర్థిగా ఆయన ఉల్లుందూర్‌పేట నుంచి పోటీ చేస్తున్నాడు.

04/21/2016 - 09:13

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారకర్తగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను తీసుకుంటారని తెలిసింది. పీపుల్స్ చాయిస్ అవార్డు, అస్కార్ పురస్కారాల పండుగ వేదికపై తళుక్కుమన్న ప్రియాంకను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది.

04/21/2016 - 09:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశం తీవ్రంగా ఎదుర్కొంటున్న కరవురక్కసిని ఎదుర్కోవటానికి రాష్ట్రాలు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి బుధవారం పిలుపునిచ్చారు. కరవు పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైన సాయాన్ని రాష్ట్రాలకు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. ఇంధన, పరిశోధనా సంస్థ(తెరి) ఏర్పాటు చేసిన ‘ ఇండియా వాటర్ ఫోరమ్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

04/21/2016 - 09:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలోని అన్ని జాతీయ రాజకీయ పార్టీల్లోకి అత్యంత సంపన్న పార్టీ అయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అంటే ఆ పార్టీ కేంద్రంలో అదికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఆ పార్టీ ఆదాయం రూ. 970.43 కోట్లకు చేరుకుంది.

04/21/2016 - 08:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: స్కూలు పిల్లల పుస్తకాల సంచుల బరువును తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న సిబిఎస్‌ఇ ఇందుకోసం పలు సిఫార్సులు కూడా చేసింది. సీనియర్ విద్యార్థులు భారీ రెఫరెన్స్ పుస్తకాలు తీసుకు రావడాన్ని టీచర్లు ప్రోత్సహించరాదని, అలాగే రెండో తరగతి దాకా పిల్లల పుస్తకాలు తరగతిలోనే ఉంచే విధానాన్ని పాఠశాలలు కొనసాగించాలనేవి ఈ సిఫార్సుల్లో ప్రధానమైనవి.

04/21/2016 - 08:55

బెంగళూరు, ఏప్రిల్ 20: ప్రావిడెంట్ ఫండ్ అంశంపై వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిర్వహించిన నిరసన ప్రదర్శన సందర్భంగా హింస చెలరేగడంతో అధికారులు బెంగళూరు నగరంలో కేంద్ర బలగాలను మోహరించారు. నిషేధాజ్ఞలు జారీ చేశారు. మంగళవారంనాటి హింసలో తీవ్రంగా దెబ్బతిన్న జలహల్లి క్రాస్ రోడ్డు మీదుగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన బలగాలు బుధవారం కవాతు నిర్వహించాయి.

04/21/2016 - 08:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఇషత్ జహాన్ అఫిడవిట్ వివాదంలో ఇరుక్కున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను కాంగ్రెస్ పార్టీ ఏకాకిని చేసింది.

04/21/2016 - 08:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: గత ఏడాది డిసెంబర్‌లో వాతావరణ మార్పుపై 190కి పైగా దేశాలు ఆమోదించిన చరిత్రాత్మక పారిస్ ఒప్పందంపై భారత్ వచ్చే శుక్రవారం న్యూయార్క్‌లో సంతకం చేయనుంది. ఫ్రెంచ్ రాజధానిలో జరిగిన 21వ భాగస్వామ్య దేశాల సదస్సులో ఆమోదించిన ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి కేంద్రమంత్రివర్గం బుధవారం ఆమోదం తెలియజేసింది.

04/21/2016 - 08:51

డెహ్రాడూన్, ఏప్రిల్ 29: గత నెల నగరంలో బిజెపి నిరసన సందర్భంగా తీవ్రంగా గాయపడిన పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ నెల రోజులకు పైగా ఇన్‌ఫెక్షన్, ఇతర సమస్యలతో పోరాడిన అనంతరం బుధవారం సాయంత్రం చనిపోయింది. సాయంత్రం అయిదున్నరగంటల సమయంలో శక్తిమాన్ చనిపోయిందని, మరణానికి కారణమేమిటో పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని ఐజి గర్వాల్ గుంజ్యాల్ చెప్పారు.

04/21/2016 - 01:01

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: పప్పు ధాన్యాల ధరలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, పప్పు ధాన్యాలను అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. పప్పు్ధన్యాల ధరలు గత ఏడాది ఉండిన కిలో 200 రూపాయల స్థాయినుంచి దిగివచ్చినప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి ధరలు ఇప్పటికీ 83-177 రూపాయల మధ్య ఉంది.

Pages