S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/21/2016 - 01:00

నైనితాల్, ఏప్రిల్ 20: ఉత్తరాఖండ్ అసెంబ్లీని సస్పెండ్ చేయడానికి రాష్టప్రతి తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్ష పరిధికి లోబడినదేనని, ఎందుకంటే ఆయన కూడా తప్పు చేయవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది.

04/21/2016 - 00:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్ అమలులో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది. స్వచ్ఛ విద్యాలయ జాతీయ అవార్డుకు రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఎంపిక అయ్యింది. మూడు నెలల కాలంలో దాదాపు 3880పైగా స్కూళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం, వౌలిక సదుపాయలను కల్పించినందుకు గాను ఈ అవార్డుకు అనంతపురం జిల్లా ఎంపిక అయింది.

04/21/2016 - 00:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత శాస్త్ర, విద్యా పరిశోధనా సంస్థ (ఐఐఎస్‌ఇఆర్)ను తిరుపతిలో ప్రారంభించటానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది.

04/20/2016 - 17:59

ముంబయి: ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి రోజురోజుకూ అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందే ప్రత్యూష అబార్షన్ చేయించుకుందని విచారణలో తేలింది. పెళ్లి కాకుండానే తన వల్ల గర్భం దాల్చడంతో ప్రత్యూష అబార్షన్ చేయించుకుందని ఆమె ప్రియుడు రాహుల్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

04/20/2016 - 17:03

ముంబయి: అనారోగ్యం నుంచి కోలుకోవడంతో బాలీవుడ్ అగ్రనటుడు దిలీప్‌కుమార్‌ను బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఈనెల 15న ఇక్కడి లీలావతి ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించారు.

04/20/2016 - 15:06

దిల్లీ: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణ కంటే రాజకీయాలే ముఖ్యమని భావిస్తే ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని దిల్లీ సిఎం కేజ్రీవాల్ సలహా ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఆయన బుధవారం అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఆగ్రహంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసేలా అధికారులు నిజాయితీతో పనిచేయాలన్నారు.

04/20/2016 - 15:06

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత పోటీచేస్తున్న ఆర్‌కె నగర్‌లో తన అభ్యర్థిగా ఎంఎన్ రాజాను బరిలోకి దింపాలని బిజెపి నిర్ణయించింది. పలు నియోజకవర్గాలకు 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బిజెపి బుధవారం విడుదల చేసింది. ఆర్‌కె నగర్‌లో జయను ఢీకొనేందుకు అన్నాడిఎంకె మాజీ మంత్రి అరంగనాయగం అల్లుడు ఎంఎన్ రాజా అభ్యర్థిత్వాన్ని బిజెపి అధినాయకత్వం ఖరారు చేసింది.

04/20/2016 - 12:33

లాతూర్: మహారాష్టల్రో తీవ్ర అనావృష్టి కారణంగా తాగునీటికి కటకటలాడుతున్న లాతూర్ పట్టణానికి బుధవారం ఉదయం నీళ్ల వ్యాగన్లతో మరో రైలు చేరుకుంది. 55 వ్యాగన్లతో 25 లక్షల లీటర్ల నీటిని ఇక్కడికి తీసుకురావడంతో ప్రజలకు తాత్కాలికంగా ఉపశమనం కలిగింది. కొద్దిరోజుల క్రితం 5 లక్షల లీటర్లతో తొలి నీటి రైలు లాతూర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

04/20/2016 - 06:45

కత్రా, ఏప్రిల్ 19: తెలివితేటల యుగం అయిన 21వ శతాబ్దం భారత దేశందేనని, దేశ జనాభాలో 80 కోట్ల మంది యువకులు 35 ఏళ్లకన్నా తక్కువ వయసు వారయినందున ప్రతి యువకుడి కల ఈ దేశ ప్రగతి గాథ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Pages