S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/01/2016 - 13:57

దిల్లీ: ఎపి, తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, పలువురు అధికారులు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు, కార్యదర్శులు, హోం శాఖ అధికారులు కూడా పలు అంశాలపై చర్చించారు.

04/01/2016 - 12:01

హైదరాబాద్: కోల్‌కతలో భారీ ప్రాణనష్టానికి దారితీసిన ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్‌లోని ఐవిఆర్‌ఎల్‌సి కంపెనీలో బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కంపెనీ నిర్మిస్తున్న ఫ్లయ్ ఓవర్ కుప్పకూలి 25 మంది మరణించడంతో సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. కోల్‌కత నుంచి ముగ్గురు పోలీసు అధికారులతో కూడిన బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఐవిఆర్‌ఎల్‌సి కంపెనీ ప్రతినిధులను విచారిస్తోంది.

04/01/2016 - 12:01

కోల్‌కత: కోల్‌కతలో గురువారం నిర్మాణంలో ఉన్న ఫ్లయ్ ఓవర్ కూలిన సంఘటనలో మృతుల సంఖ్య 25కి పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పదిమంది పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా మరికొంత మంది చిక్కుకుని ఉండచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.

04/01/2016 - 04:02

కోల్‌కతా, మార్చి 31: నగరంలో రద్దీగా ఉండే కూడలిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌లో కొంతభాగం గురువారం మధ్యాహ్నం కూలిపోవడంతో కనీసం 18 మంది మరణించగా, మరో 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 23గా అనధికారిక వార్తలు పేర్కొంటున్నాయి. కూలిపోయిన ఫ్లైఓవర్ శకలాల కింద వాహనాలు నుజ్జు నుజ్జు కాగా, జనం, చిరువ్యాపారులు పలువురు చిక్కుకు పోయారు.

04/01/2016 - 03:29

న్యూఢిల్లీ, మార్చి 31: రాష్టప్రతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 1 తర్వాత జరిపే వ్యయానికి అధికారాలు ఇచ్చేందుకు కేంద్రం గనుక ఆర్డినెన్స్ జారీ చేసిన పక్షణలో కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ గురువారం ఇక్కడ చెప్పారు.

04/01/2016 - 03:21

హైదరాబాద్, మార్చి 31: నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందారనే భావన బలపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాలతో ఆయన అదృశ్యం, మృతిపై నెలకొన్న మిస్టరీ మరింత పెరిగింది. నేతాజీ దుర్మరణానికి కారణమైనట్లుగా భావిస్తున్న విమాన ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆయన మూడుసార్లు చేసిన ఉపన్యాసాలు ప్రసారం కావడం ఆయన అదృశ్యంపై మిస్టరీని మరింత పెంచింది.

04/01/2016 - 03:18

న్యూఢిల్లీ, మార్చి 31: ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు వౌఖికంగా ‘తలాక్ తలాక్ తలాక్’ అని చెబితే విడాకులు ఇచ్చేసినట్టే. అయితే ఏకపక్షంగా నోటితో మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులివ్వడాన్ని నిషేధించాలని దేశంలో మహిళల స్థితిగతులను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.

04/01/2016 - 03:26

దిగ్బాయ్(అస్సాం), మార్చి 31: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పిస్తానని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌లో దాక్కున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, ఐపిఎల్ మాజీ చీఫ్ లిలిత్ మోదీని ఎందుకు తీసుకురాలేకపోతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

04/01/2016 - 03:12

న్యూఢిల్లీ, మార్చి 31: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాలు, భాగస్వాములు, పిల్లలకు సంబంధించిన వివరాలు అందించాల్సి ఉంటుంది. లోక్‌పాల్ చట్టంలోకి కొత్త నిబంధనల కింద పెయింటింగ్స్, ఫర్నీచర్, పురాతన వస్తువులు, విద్యుత్ పరికరాల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.

04/01/2016 - 02:48

న్యూఢిల్లీ, మార్చి 31: బీడీ కట్టలపై 85 శాతం పుర్రె హెచ్చరిక గుర్తు జీవో అమలును నిలుపుదల చేయాలని నిజామాబాద్ ఎంపీ కె కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె కేంద్రానికి లేఖ రాశారు.

Pages