S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/19/2016 - 04:42

న్యూఢిల్లీ: ప్రజలను గందరగోళంలో పడేసే రకరకాల ప్రచారాలకు బదులు ఆరోగ్యం లాం టి అంశాలపై మీడియా గనుక నిరంతర ప్రచారోద్యమం నిర్వహించిన పక్షంలో వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తోడ్పడుతాయని కేం ద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక శాఖతో పాటుగా సమాచార, ప్రసారాల శాఖను కూడా నిర్వహిస్తున్న జైట్లీ శుక్రవారం ఇక్కడ ఆరవ జాతీయ కమ్యూనిటీ రేడియో సమ్మేళనంలో మాట్లాడారు.

03/19/2016 - 04:36

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడిపై దర్యాప్తు చేయడానికి వస్తున్న పాక్ సంయుక్త విచారణ బృదం పర్యటన నిమిత్తం కేంద్ర ప్రభు త్వం విధివిధానాలు రూ పొందిస్తోంది. కేంద్ర హోమ్ మం త్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పాక్ సంయుక్త విచారణ బృందం వస్తుందన్న విషయం మీడి యా ద్వారానే తెలుసుకున్నాం. విచారణకు సంబంధించి మేం పూర్తి సమాయత్తంగానే ఉన్నాం’అని ఆయన స్పష్టం చేశారు.

03/19/2016 - 04:30

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి

03/19/2016 - 02:53

ఆంధ్రభూమి ప్రతినిధి

03/19/2016 - 02:09

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆస్తులు, నిధులు కేవలం తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ ఆస్తులను రెండు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలనీ, అలా కుదరని పక్షంలో పంపకాల కార్యక్రమాన్ని రెండు నెలల్లో పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలని తీర్పు చెప్పింది.

03/19/2016 - 01:58

న్యూఢిల్లీ, మార్చి 18: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం,కేరళ సహా దేశంలోని అనేక రాష్ట్రాల రాజకీయ నాయకత్వానికి ఊరట లభించింది. ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రుల ఫొటోలను ప్రచురించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతించింది.

03/18/2016 - 16:50

న్యూదిల్లి:పార్లమెంట్‌పై దాడికేసులో ఉరితీతకు గురైన అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై దేశద్రోహం కేసులో నిందితులైన జెఎన్‌యు విద్యార్థులు అనిర్బన్ భట్టాచార్య, ఉమర్ ఖాలిద్‌లకు బెయిల్ లభించింది. వారిద్దరినీ గతనెల 23న అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కన్నయ్యకుమార్ గతంలోనే బెయిల్‌పై విడుదలయ్యారు.

03/18/2016 - 16:50

న్యూదిల్లి:ఒబిసి రిజర్వేషన్లకోసం జాట్ కులస్తులు విధించిన గడువు ముగియడంతో వారు మళ్లీ ఆందోళనకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. గతనెలలో జాట్ కులస్తుల ఆందోళనలో 30మంది మరణించగా కోట్లాదిరూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గతానుభవంతో ఈసారి అటు కేంద్రం, ఇటు హర్యానా ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి.

03/18/2016 - 08:05

నీట్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా

03/18/2016 - 07:12

మహారాష్ట్ర సిఎంను నిలదీసిన శివసేన

Pages