S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/17/2016 - 07:58

వెల్లోర్ (తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషులుగా ఇక్కడి కేంద్ర కారాగారంలో సుమారు 25 ఏళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్న శ్రీహరన్, శంతన్ లోతయిన ఆధ్యాత్మికపరులుగా మారిపోయారు. ఈ కేసులోని ఏడుగురు ఖైదీలలో వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, శంతన్ ప్రతి రోజు జైలు ఆవరణలో గల దేవాలయాలను సందర్శించి, అమ్మన్ దేవతను, గణేశుడు, సాయిబాబాలను ప్రార్థిస్తుంటారని ఉన్నత స్థాయి జైలు వర్గాలు తెలిపాయి.

03/17/2016 - 04:49

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిలు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 3 రూపాయల 7 పైసలు, డీజిలు ధర రూపాయి 90 పైసలు పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం ప్రకటించాయి. రాష్ట్ర సుంకాలతో కలుపుకొని కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రినుంచి అమలులోకి వస్తాయని దేశంలో అతి పెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.

03/17/2016 - 04:48

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయింపుల వివాదం కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. బుధవారం సుప్రీం కోర్టులో న్యాయముర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తిసింగ్‌లతోకూడిన ధర్మాసనం బుధవారం కేసును విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.

03/17/2016 - 04:46

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కాంగ్రెస్ గళమెత్తింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ బృందం ఆందోళన చేపట్టింది.

03/16/2016 - 19:57

న్యూదిల్లి:పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల క్రితం తగ్గిన ధరలకన్నా కాస్త ఎక్కువగానే పెరగడంతో జనంపై భారం పడినట్లే అవుతుంది. ఇప్పుడు లీటర్ పెట్రోల్‌పై 3 రూపాయల ఏడు పైసలు పెరగ్గా, డీజిల్‌పై రూపాయి 90 పైసలు పెరిగింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలను బట్టి పెట్రో ఉత్పత్తుల ధరలు మారుతున్నాయి.

03/16/2016 - 19:56

ముంబయి:‘భరత్ మాతాకీ జై’ అని నినదించనన్న ఎంఐఎం శాసనసభ్యుడు వారిస్ పఠాన్‌ను ఈ సమావేశాలు ముగిసేవరకు శాసనసభనుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయానికి అధికారపక్షానికి బాసటగా విపక్షం నిలిచింది. కాగా దీనిపై స్పందించిన పఠాన్ అవసరమైతే తాను ‘హిందుస్తాన్ జిందాబాద్’ అని అంటానుగానీ భారత్‌మాతాకీ జై అని మాత్రం అనేదిలేదని స్పష్టం చేశాడు.

03/16/2016 - 07:22

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపితోపాటు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. సభ నుంచి సస్పెండ్ చేస్తానని ఉపాధ్యక్షుడు కురియన్ పలుమార్లు హెచ్చరించినా కాంగ్రెస్ సభ్యులు వెనకడుగు వేయకుండా ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టారు.

03/16/2016 - 07:08

న్యూఢిల్లీ: విద్యా సంస్థల్లో దేశభక్తి, సహనశీలత వంటి ఉన్నత భావనలను బలంగా పాదుగొల్పాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. కొన్ని యూనివర్సిటీల్లో జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న వివాదాల నేపథ్యంలో రాష్టప్రతి ఇచ్చిన పిలుపునకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. విద్యార్థుల్లో నిజాయితీ, మహిళల పట్ల గౌరవ భావనలను పెంపొందించాల్సిన అగత్యం కూడా ఎంతో ఉందని రాష్టప్రతి ఉద్ఘాటించారు.

03/16/2016 - 07:08

న్యూఢిల్లీ: దేశంలో నక్సలిజాన్ని అంతమొందించడానికి ప్రభుత్వం ఒక ఉద్యమం స్ఫూర్తితో పని చేస్తుందని కేంద్రం మంగళవారం లోక్‌సభలో తెలియజేసింది. అందువల్ల తీవ్రవాద హింసాకాండలో మృతుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిందని కూడా ప్రభుత్వం తెలియజేసింది.

03/16/2016 - 07:07

తిరువనంతపురం/అలపుజ: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కేరళ అప్పుడే రాజకీయ హింసాకాండతో అట్టుడుకుతోంది. అలపుజలోని ఎవూర్‌లో మంగళవారం తెల్లవారు జామున డివైఎఫ్‌ఐ కార్యకర్తలు సునీల్ కుమార్ (28) అనే యువజన కాంగ్రెస్ కార్యకర్తను కొట్టి చంపగా, తిరువనంతపురం జిల్లాలో బిజెపి, సిపిఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 30 మంది గాయపడ్డారు.

Pages