S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/01/2016 - 05:54

న్యూఢిల్లీ: పెట్రోల్ ధర మళ్లీ తగ్గింది. లీటర్‌పై రూ.3.02 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే డీజిల్‌పై లీటరుకు రూ.1.47 పై. చొప్పున పెంచుతున్నట్టు వెల్లడించింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చే ఈ రేట్ల ప్రకారం లీటర్ పెట్రోల్ రూ.59.63 పైసల నుంచి 56.63కు తగ్గుతుంది. అలాగే డీజిల్ ధర కూడా రూ.44.96పై. నుంచి రూ.46.43కు పెరుగుతుంది.

03/01/2016 - 05:44

రూ.19.78 లక్షల కోట్లతో పద్దు

02/29/2016 - 17:37

ముంబయి: ఈ ఏడాది ఉత్తమనటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన లియోనార్డో డికాప్రియోను బాలీవుడ్ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ‘ది రెవెనంట్’ సినిమాలో నటనకు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన ఆయన అవార్డుల సభలో పర్యావరణం, వాతావరణ మార్పులపై ప్రసంగించడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని బాలీవుడ్ ప్రముఖులు ఫర్సాన్ అఖ్తర్, సోనాక్షి సిన్హా, అదితి రావ్, మాధుర్ భండార్కర్, హమా ఖురేషీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

02/29/2016 - 17:36

థానె: మహారాష్టల్రోని థానెలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందిని హతమార్చిన ఘటనలో తీవ్ర గాయాలతో బతికి బయటపడిన మహిళ సుబియా ఈరోజు అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. స్పృహ వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ, తన అన్న అన్వర్ అందరినీ చంపేశాడని, తనపై దాడి చేయగా గదిలోకి వెళ్ల గడియ పెట్టుకున్నానని తెలిపింది.

02/29/2016 - 17:34

చండీగఢ్: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశానికి లూధియానా రాగా, ఆయన కారుపై కొందరు సిక్కు యువకులు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇటీవల లూధియానా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో మరణించగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితత కేజ్రీవాల్ అక్కడికి వెళ్లారు.

02/29/2016 - 13:27

దిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలను వివరిస్తూ తన ప్రసంగం ముగించిన వెంటనే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

02/29/2016 - 13:26

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభకు సమర్పించారు. జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్‌లో విశేషాలు...
* మొత్తం బడ్జెట్‌ రూ.19.78లక్షల కోట్లు
* ప్రణాళికా వ్యయం రూ.5.5లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షలకోట్లు
* బ్యాంకుల మూలధన సమీకరణకు రూ.25వేల కోట్లు

02/29/2016 - 13:17

దిల్లీ: వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభకు సమర్పించారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

02/29/2016 - 12:12

దిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ద్రవ్యోల్బణం 9.6 నుంచి 5.4 శాతానికి తగ్గిందని, వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తోందని వివరించారు.

02/29/2016 - 12:02

దిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆయన బడ్జెట్ ప్రతిపాదనను సభలో చదివి వినిపిస్తున్నారు.

Pages