S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/29/2016 - 08:04

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత నాలుగేళ్లలో దాదాపు 60వేల మంది పిల్లల ఆచూకీ లభించడం లేదు. తప్పిపోతున్న పిల్లల్ని పసిగట్టి వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 2.5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధ్యం కావడం లేదు.

02/29/2016 - 08:01

న్యూఢిల్లీ: ఇంటర్‌వ్యూ కాల్‌లెటర్స్ ఇక స్వస్తిచెబుతున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) తెలిపింది. వాటికి బదులుగా ఇ-సమ్మన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ప్రతి ఏడాది ఐఏఎస్, ఐపిఎస్ ఉద్యోగాలకోసం యుపిఎస్‌సి పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. వాటిలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షతోపాటు ఇంటర్‌వ్యూలు ఉంటాయి.

02/29/2016 - 08:00

న్యూఢిల్లీ: జెఎన్‌యులో చోటుచేసుకున్న పరిణామాలపై పార్లమెంటులో తన వాగ్ధాటితో అధికారపక్ష సభ్యుల్ని మెప్పించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పార్టీలో మాత్రం పరిస్థితి అంత అనుకూలంగా లేనట్టు తెలుస్తోంది. పైపెచ్చు.. చర్చ జరిగిన తొలిరోజు లోక్‌సభలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల అధిష్ఠానం గుర్రుగా ఉందట.

02/29/2016 - 07:58

న్యూఢిల్లీ: ‘మీకే కాదు..నాకూ పరీక్ష ఉంది. అది సాధారణ బడ్జెట్ పరీక్ష.నేనూ దాన్ని ఎదుర్కోవాలి’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల నుద్దేశించి అన్నారు. మొత్తం 125 కోట్ల మంది పెట్టే ఈ పరీక్షను ఎదుర్కోగలనన్న ధీమా తనకు ఉందని తెలిపారు. మంగళవారం టెన్త్, ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి వత్తిళ్లకు లోనుకాకుండా వాటిని ఎదుర్కోవాలని స్ఫూర్తిదాయక రీతిలో స్పష్టం చేశారు.

02/29/2016 - 05:12

ముచ్చటగా మూడో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్న ఆర్థిక మంత్రి జైట్లీకి వ్యవసాయ, పరిశ్రమల అవసరాలు కోణంలో కత్తిమీద సాములాంటి పరిస్థితే. నానాటికీ కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికీ, వృద్ధి రేటును పరుగు పెట్టించే లక్ష్యానికి అనుగుణంగా విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కేటాయింపుల్లో ఈ రకమైన సమతూకాన్ని సాధించడం జైట్లీ ముందున్న పెద్ద సవాలు.

02/29/2016 - 06:29

నేటి పరిస్థితుల్లో రైతాంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది.. వీటికి పరిష్కారం లేకపోలేదు. ఈ సవాళ్లనింటినీ అవకాశాలుగా మార్చుకోవాలంటే రైతులు కేంద్రానికి సహకరించాలి. అదేవిధంగా రాష్ట్రాలన్నీ వ్యవసాయ రంగానికి ఉద్దేశించిన పథకాలను తు.చ. తప్పక అమలు చేయాల్సి ఉంటుంది

02/29/2016 - 05:01

థానె: పట్టరాని కోపంతో 14మంది కుటుంబీకుల ప్రాణాలు తీసిన హంతకుడి కథనం థానె పరిసరాల్లో సంచలనం రేకెత్తించింది. కొత్త ముంబయి, మహాపోలి ప్రాంతాల్లో నివాసముంటున్న అక్కచెల్లెళ్లు, వాళ్ల పిల్లలను సైతం విందుకని ఇంటికి ఆహ్వానించి, వాళ్లంతా నిద్రలో ఉండగానే గొంతులు కోసిన వైనం భయబ్రాంతులకు గురి చేసింది.

02/28/2016 - 13:34

దిల్లీ: ఇక్కడి బదర్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు టోల్‌ప్లాజా సిబ్బందిపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. టోల్‌ప్లాజాలో నగదును చేజిక్కించుకుని వారు పరారయ్యారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు, క్యాషియర్ మరణించగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

02/28/2016 - 13:30

ముంబయి: ఏడుగురు చిన్నారులతో పాటు 14 మందిని దారుణంగా హతమార్చిన ఓ కిరాతకుడి వికృత చేష్ట ఇది. మహారాష్టల్రోని థానెలో ఆదివారం ఉదయం ఈ ఘోరం వెలుగు చూసింది. వీరందరినీ శనివారం అర్ధరాత్రి ఆ వ్యక్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న పురుషుడి చేతిలో కత్తి ఉందని, ఆ వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంటున్నారు.

02/28/2016 - 06:32

డెహ్రడూన్: భారత సరిహద్దుల్లో తరచూ కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ చర్యలపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కాల్పులు జరుపుతూ ఉంటే వాళ్ల తుపాకుల నుంచి వచ్చే బుల్లెట్లను లెక్కిస్తూ కూర్చోవాలా? అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు దీటుగానే జవాబు చెబుతామని హోమ్‌మంత్రి హెచ్చరించారు. భారత్ వైపునుంచి ముందుగా ఒక్క బుల్లెట్ కూడా వెళ్లకుండా చూస్తామన్నారు.

Pages