S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/28/2016 - 06:29

న్యూఢిల్లీ: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ శనివారం భోపాల్‌లోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన సభలో 20 మంది నియామకంలో అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసు నమోదైంది. అనంతరం దిగ్విజయ్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అలాగే 30వేల రూపాయలు పూచీకత్తు చెల్లించాలని జడ్జి ఆదేశించారు.

02/28/2016 - 06:29

న్యూఢిల్లీ: కేంద్ర విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై చర్చ జరిగిన సందర్భంగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, జెడి(యు) తదితర ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ అంశంపై సోమవారం లోక్‌సభలో సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదించనున్నాయి.

02/28/2016 - 05:50

న్యూఢిల్లీ: భారతీయుల్లో అత్యంత ప్రభావశీలత కలిగిన 100 ప్రముఖుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు రెండో స్థానం లభించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ భారత్‌కు చెందిన వందమంది ప్రముఖల జాబితాలో ఈ పవర్ లిస్టును రూపొందించింది. అనేక రకాలుగా వివాధాలు చుట్టుముడుతున్నప్పటికీ మోదీ జనాకర్షక శక్తి ఎంత మాత్రం తగ్గలేదని తెలిపింది.

02/28/2016 - 05:49

ముంబయి: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వివాదంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో బిజెపి వేర్పాటువాద విత్తనాలు నాటుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

02/28/2016 - 05:43

న్యూడిల్లీ: కాకినాడకు చెందిన జ్యోతిష్యుడు డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తికి ‘్భరత్ భూషణ్’ అవార్డు ప్రదానం చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ సంస్థ ఈ అవార్డును మూర్తికి అందజేసింది. ఢిల్లీలోని ఛత్రాపుర్ ఎస్‌ఎకె శక్తిపీఠ్ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రామకృష్ణ శాస్ర్తీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

02/28/2016 - 05:29

చాలకాలంగా ఊరిస్తూ వచ్చిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చివరికి ఎలాంటి ఉత్కంఠను రేపకుండానే ముగిసింది. ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌ను 83 పరుగులకే అలౌట్ చేసిన భారత్ అత్యంత సాధారణమైన లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్లు భారీగా స్కోర్లు చేస్తాయని అనుకున్నా, బౌలర్ల ఆధిపత్యం కొనసాగడం అభిమానులను నిరాశ పరచింది. ఇందులో పాక్ 17.3, భారత్ 15.3 చొప్పున ఓవర్లు ఆడాయి.

02/28/2016 - 05:10

న్యూఢిల్లీ: 2018వ సంవత్సరంలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉమ ఢిల్లీలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు రూ. 2300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, కేంద్రం ఇప్పటి వరకు రూ.300 కోట్లు ఇచ్చిందని తెలిపారు.

02/28/2016 - 05:06

బెల్గాం (కర్నాటక): మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే భారత దేశం చుక్కాని లాంటిదని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక మాంద్యంతో పాటు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు ఒక్క భారత దేశమే ఆశాకిరణంగా భాసిల్లుతోందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రపంచ బ్యాంక్, ఐఎమ్‌ఎఫ్, ఇతర రేటింగ్ సంస్థలు వెలువరించిన నివేదికలను మోదీ ఉటంకించారు.

02/27/2016 - 16:46

ఆగ్రా : ఆగ్రాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయి.

02/27/2016 - 11:51

భువనేశ్వర్: రాయగఢ్ జిల్లాలో కళ్యాణసింగపూర్ అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ మావోయిస్టు మరణించాడు. కాల్పుల తర్వాత పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Pages