S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/27/2016 - 00:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే సంస్కరణలను చేపట్టాల్సిందేనని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అలాగే అనవసర సబ్సిడీలను తొలగించాల్సిన అవసరం ఎంతో ఉందని మార్గనిర్దేశన చేసిన సర్వే, విత్త సంఘటన విషయంలోనూ నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యాలను సాధించే దిశగా సాగాలని తెలిపింది.

02/27/2016 - 00:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ వర్శిటీ ఘటనలపై గురువారం సమాధానమిస్తూ దుర్గమాతపై చేసిన వ్యాఖ్యలు శుక్రవారం రాజ్యసభలో దుమారం రేపాయి. స్మృతి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవకు దారితీయడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

02/26/2016 - 16:22

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితుడైన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ను ఈ నెల 15న నగరంలోని పటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చినపుడు జరిగిన దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు లాయర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. కన్నయ్యకుమార్‌ను కోర్టుకు తెచ్చినపుడు లాయర్లకు, విద్యార్థులకు ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.

02/26/2016 - 16:22

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా చిదంబర్ వద్ద గురువారం అర్ధరాత్రి ఓ బస్సు లోయలో పడి ఏడుగురు మరణించారు. సంఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులుండగా, వేగంగా వెళ్తుండగా 150 అడుగుల లోయలో పడిపోయింది. గాయపడిన 25 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు

02/26/2016 - 12:01

దిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వే నివేదికను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏటా బడ్టెట్ ముందు ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంటుకు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఆ సర్వే ఆధారంగానే బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందిస్తారు.

02/26/2016 - 11:53

ముంబై: సోనమ్ కపూర్ కీలక పాత్రలో నటించిన ‘నీర్జా’ చిత్రానికి గుజరాత్ ప్రభుత్వం వినోదపు పన్ను రద్దు చేసింది. ఈ సినిమాకు ఇప్పటికే మహరాష్టల్రో కూడా పన్ను రద్దు చేశారు. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి ఆనందీబెన్‌కు సోనమ్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

02/26/2016 - 07:29

న్యూఢిల్లీ: ముస్లిం మైనార్టీలకు మత ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు.

02/26/2016 - 07:26

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో దేశద్రోహ కేసుకు సంబంధించి పోలీసులు అనే్వషిస్తున్న వారిలో ఆ వర్శిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు తమ కాంటాక్ట్ వివరాలను తెలియజేస్తూ పోలీసులకు లేఖ రాశారు. ఈ కేసులో పోలీసులు ఎప్పుడు అవసరమనుకుంటే తమను ప్రశ్నించుకోవచ్చని, లేదంటే అరెస్టు కూడా చేసుకోవచ్చని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

02/26/2016 - 07:18

ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి కలిఖో పుల్ గురువారం శాసనసభలో తనకు ఉన్న బలాన్ని నిరూపించుకున్నారు. 40 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిచ్చారు. ఇందులో 27 మంది కాంగ్రెస్ పార్టీకి, 11 మంది బిజెపికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు స్వతంత్రులు. మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకీ శిబిరంనుంచి బుధవారం కలిఖో శిబిరంలోకి చేరిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిఖోకు ఓటు వేశారు.

02/26/2016 - 06:42

న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్ ప్రసంగంలో అనేక కొత్త రైళ్లను ప్రకటించారు. ఇందులో నాలుగు కొత్త తరహా రైళ్లున్నాయి. రద్దీగా ఉండే, ఎక్కువ దూరంలో గల మార్గాలలో రిజర్వేషన్ లేని సూపర్ ఫాస్ట్ రైలు ‘అంత్యోదయ’ ఎక్స్‌ప్రెస్‌ను, పూర్తిస్థాయిలో ఎయిర్‌కండిషన్ సదుపాయం ఉన్న ‘హుమ్‌సఫర్’ ఎక్స్‌ప్రెస్, గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ‘తేజాస్’ను ఆయన ప్రకటించారు.

Pages