S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/26/2016 - 09:13

న్యూఢిల్లీ: ఎలాంటి చార్జీల మోతా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వ రైల్వే బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మరింత వేగాన్ని, భద్రతను సంతరించుకునే దిశగా రైల్వేలను తీర్చిదిద్దాలన్న దూరదృష్టికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్ అద్దం పడుతోందని అన్నారు.

02/26/2016 - 06:38

న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్యవహారంపై తాను రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుగా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. గురువారం రాజ్యసభలో రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్‌యులో ఇటీవల సంభవించిన పరిణామాలపై జరిగిన చర్చలో హనుమంతరావు పాల్గొన్నారు.

02/26/2016 - 06:37

న్యూఢిల్లీ: దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మానుకోవాలని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. అసమ్మతిని అణచివేసే కుట్రలో భాగంగానే మత, నియంతృత్వ హిందూరాజ్య స్థాపనకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

02/26/2016 - 06:36

శ్రీనగర్: ఉగ్రవాదంపై పోరులో భారత్ గొప్ప విజయం సాధించింది. పాకిస్తాన్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన యువ ‘్ఫదారుూ’ (ఆత్మాహుతి దళ సభ్యుడి)ని జమ్మూ-కాశ్మీరులోని బారాముల్లాలో గురువారం సజీవంగా పట్టుకుంది. ఈ ఉగ్రవాదిని మొహమ్మద్ సాదిక్ గుజ్జర్ (17)గా గుర్తించారు. కుప్వారా జిల్లా తాంగ్ధర్‌లోని సైనిక శిబిరంపై గత ఏడాది నవంబర్ 25న దాడికి పాల్పడిన ఉగ్రవాద బృందంలో గుజ్జర్ కూడా ఉన్నాడు.

02/26/2016 - 06:34

న్యూఢిల్లీ: రైలు ప్రమాదాలను నివారించడానికి మంత్రి సురేశ్ ప్రభు తన రైల్వే బడ్జెట్‌లో మిషన్ ‘జీరో యాక్సిడెంట్’ పేరిట రూపొందించిన ఒక ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ ప్రణాళిక ప్రకారం రానున్న మూడు, నాలుగేళ్లలో దేశంలోని బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌లపై ఉన్న అన్ని కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లను తొలగిస్తారు. దీనికోసం సృజనాత్మకమైన ఫైనాన్సింగ్ యంత్రాంగం పనిచేస్తుంది.

02/26/2016 - 06:33

రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2016 సంవత్సరానికి గాను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఎన్నో ప్రత్యేకతలకు, కొత్త ఆలోచనలకు అద్దం పట్టింది. మొత్తం బడ్టెల్‌లో ఆయన చేసిన కీలక ప్రతిపాదనల్లో కొన్ని...
ప్రధాని నరేంద్ర మోదీ కలల సాకారమే లక్ష్యం
92 శాతం ఆపరేషన్స్ నిష్పతి సాధనే ధ్యేయం
మరో వంద రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం

02/26/2016 - 06:30

పుణే/ముంబయి: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు జైలు జీవితం నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. 1993లో ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలిన సంజయ్ దత్‌కు జైలు శిక్షను కుదించడంతో గురువారం ఆయన పుణేలోని యెరవాడ జైలు నుంచి 103 రోజుల ముందే విడుదలై స్వేచ్ఛను పొందాడు. ముంబయి పేలుళ్లకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను వదిలేయాలనుకుంటున్నానని అతను చెప్పాడు.

02/26/2016 - 05:07

వాస్తవానికి దగ్గరగా
ఉంది: కవిత

02/26/2016 - 05:03

న్యూఢిల్లీ: చార్జీల మోత మోగలేదు... కొత్త ప్రాజెక్టుల ఊసు లేదు.. భారీగా నిధుల కేటాయింపులు జరగలేదు. అయితేనేం... ప్రయాణికుల సౌకర్యాలకు అగ్ర తాంబూలమిచ్చారు. అదనపు వసతులకు పెద్దపీట వేశారు. తద్వారా ‘ఆమ్ ఆద్మీ’ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆచి తూచి రూపకల్పన చేసిన బడ్జెట్ సారాంశమిది.

02/26/2016 - 04:57

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే ప్రాజెక్టుల ఊసే సురేశ్ ప్రభు బడ్జెట్‌లో లేదు. కనీసం నిధుల పరంగానైనా సంతృప్తి కలుగలేదు. విదిలింపు చందంగానే అరకొర కేటాయింపులతో సరి పెట్టారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణ రైల్వే వ్యవస్థ, ఎంఎంటిఎస్ అభివృద్ధికి తోడ్పడతామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు.

Pages