S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/26/2016 - 04:42

మోత, కోత లేని రైలు కూత
జనరంజకంగా సురేశ్ ప్రభు బడ్జెట్

02/25/2016 - 16:57

చెన్నై: శివకాశి జిల్లా నారాయణపూర్ వద్ద ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగినపుడు ఫ్యాక్టరీలో దాదాపు వందమంది కార్మికులు పనిచేస్తున్నారని, ఇంతవరకూ ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేసినట్లు తెలిసింది.

02/25/2016 - 14:36

దిల్లీ: కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాన్యుడికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు 30 శాతం బెర్తుల కేటాయింపు, టాయిలెట్ల అభివృద్ధి, రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆధునిక సమాచార వ్యవస్థ వంటి అంశాలు బడ్జెట్‌లో ఉన్నాయి. రైల్వే బడ్జెట్‌లో కొన్ని ముఖ్య విషయాలు...
* కొత్త రైళ్లు ప్రకటించని సురేష్‌ ప్రభు
* రైలు చార్జీలు యధాతథం

02/25/2016 - 13:53

దిల్లీ: రైల్వేమంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను చదవడం పూర్తయిన వెంటనే లోకసభ మధ్యాహ్నం 2-15 గంటలకు వాయిదా పడింది.

02/25/2016 - 12:26

దిల్లీ: దేశ ప్రజల అవసరాలు, సామాన్యుల ఆకాంక్షలు నెరవేరేలా రైల్వే బడ్జెట్‌ను తీర్చిదిద్దామని రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఆయన లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ప్రయాణీకుల కోసం తాము రూపొందించిన ప్రతిపాదనలు వివరించడం ప్రారంభించారు. రైల్వేశాఖను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.

02/25/2016 - 11:48

పూణె: ఇక్కడి ఎరవాడ కారాగారం నుంచి విడుదలైన సినీ నటుడు సంజయ్‌దత్ జైలు ఆవరణలో భూమిని ముద్దాడి జైలుకి సెల్యూట్ చేసి బయటికి వచ్చారు. మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న తరుణంలో స్వేచ్ఛను పొందడం అంత సులభం కాదని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నారు.

02/25/2016 - 11:47

పూణె: ముంబై వరుస పేలుళ్లలో కేసులో ఐదేళ్ళ జైలుశిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం ఉదయం పూనెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో సత్ప్రవర్తనను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు శిక్షాకాలం తగ్గించింది. దీంతో 8 నెలల ముందుగానే ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అవకాశం కలిగింది. విడుదలైన వెంటనే జైలు వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

02/25/2016 - 07:33

న్యూఢిల్లీ: జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి సభ్యులు బుధవారం ఇక్కడ ర్యాలీ నిర్వహించారు. రామ్‌లీలా మైదాన్ నుంచి జంతర్‌మంతర్ వరకూ జాతీయ జెండాలను చేతబూని పెద్దఎత్తున ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీ వల్ల టాల్‌స్టాయ్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

02/25/2016 - 07:29

న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాదానికి కారకులయిన పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 11 మంది పేర్లను భారత్ తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆంక్షల కమిటీకి అందజేసింది. వీరంతా పాకిస్తాన్‌లోని అల్‌ఖయిదా, తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు.

02/25/2016 - 07:27

న్యూఢిల్లీ: ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దళిత స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. తన రెండో కుమారుడు రాజాకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ఆమె కోరారు. ఆమెతోపాటు చిన్న కుమారుడు రాజా, అతని మిత్రులు కేజ్రీవాల్‌ను కలిసినవారిలో ఉన్నారు. రాధిక విజ్ఞప్తికి ఢిల్లీ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

Pages