S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/24/2016 - 15:48

దిల్లీ: దేశ రాజధానిలోని ఏపీ భవన్ ముందు బుధవారం ఉదయం బైక్‌పై వెళుతున్న ఓ ఆగంతకుడు రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళ మెడలో నుంచి అయిదు తులాల బంగారు గొలుసును తస్కరించి పరారయ్యాడు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

02/24/2016 - 13:38

ముంబయి: పూణెలోని ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్‌ను గురువారం ఉదయం 9 గంటల సమయంలో విడుదల చేసేందుకు అధికారులు అన్ని లాంఛనాలను పూర్తి చేస్తున్నారు. 1993 ముంబయి పేలుళ్ల నేపథ్యంలో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడన్న అభియోగంపై బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కోర్టు అయిదేళ్ల జైలుశిక్షను విధించిన సంగతి తెలిసిందే.

02/24/2016 - 13:36

చెన్నై: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో వెల్లూర్ జైలులో జీవితశిక్ష అనుభవిస్తున్న నళినికి అధికారులు 12 గంటల పెరోల్ మంజూరు చేశారు. చెన్నైలో మరణించిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నళినికి పెరోల్ ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం ఆరు గంటలకు బయటకు వచ్చిన ఆమె సాయంత్రం ఆరు గంటలలోగా తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంది.

02/24/2016 - 13:35

దిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన బుధవారం రాజ్యసభలో వేడి పుట్టించింది. హెచ్‌సియులో దళిత వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆరోపించారు. బిఎస్‌పి ఎంపీ మాయావతి రోహిత్ ఉదంతాన్ని ప్రాస్తావించి, ఈ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బిఎస్పీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లగా డిప్యూటీ చైర్మన్ వారించారు.

02/24/2016 - 12:02

దిల్లీ: దేశంలో జరుగుతున్న పలు ఆందోళనలు, ఉద్యమాల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలందరికీ చెందిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైతే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలదే బాధ్యత అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

02/24/2016 - 12:00

దిల్లీ: దేశద్రోహ కేసులో నిందితుడైన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్య దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌పై దిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 29కి వాయిదా వేసింది. కన్నయ్యతోపాటు మరో ఐదుగురిపై దేశద్రోహ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

02/24/2016 - 11:59

గాంధీనగర్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సముద్ర తీరాన బుధవారం ఉదయం ఓ పడవ కనిపించటం కలకలం రేపింది. పాకిస్తాన్ నుంచి ఆ పడవలో ఎవరో వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖాళీగా ఉన్న పడవలో 12 తుపాకులను స్వాధీనం చేసుకొని, అందులో వచ్చిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

02/24/2016 - 11:59

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ బుధవారం ఉదయం సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

02/24/2016 - 11:58

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య జోక్యం చేసుకొని ప్రతిపక్షాలు అడిగే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

02/24/2016 - 07:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్‌లోని బేడ (బుడగ) జంగం కులస్థులను షెడ్యూల్డు కులాల జాబితాలోని 9వ నంబర్‌లోనే కొనసాగించాలని అఖిల భారత బేడ, జంగమ కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆలేటి మల్లయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తమ కులస్థులను షెడ్యూల్డు కులాల జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Pages