S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/24/2016 - 07:07

ముంబయి: ఏసుక్రీస్తు తమిళ హిందువని పేర్కొంటూ హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి సావర్కర్ సోదరుడు రాసిన ఓ వివాదాస్పద పుస్తకం తొలుత ప్రచురణ అయిన 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తిరిగి అవిష్కరిస్తున్నారు.

02/24/2016 - 07:06

న్యూఢిల్లీ: జెఎన్‌యు వివాదానికి సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసులు యు-టర్న్ తీసుకున్నారు. వర్శిటీ క్యాంపస్‌లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడన్న అభియోగాలతో 11 రోజుల క్రితం దేశద్రోహ నేరం కింద అరెస్టయిన జెఎన్‌యుఎస్‌యు (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం) అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిలుకోసం చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ పోలీసులు మంగళవారం కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించారు.

02/24/2016 - 07:05

న్యూఢిల్లీ: సార్వత్రిక బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం పార్లమెంట్‌ను ఉద్ధేశించి రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగం ‘నిరాశాజనకం’గా ఉందని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి.

02/24/2016 - 07:04

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) వివాదానికి సంబంధించిన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తిప్పికొట్టారు.

02/24/2016 - 07:03

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కేంద్రానికి పంపిన నివేదికల విషయంలో కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయంది. ఆ గవర్నర్ తమకు పంపిన నివేదికలో ఏముందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది.

02/24/2016 - 05:28

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ తదుపరి విచారణ మార్చి 7 తేదీకి వాయిదా పడింది. శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారించింది.

02/24/2016 - 05:17

న్యూఢిల్లీ: హైదరాబాద్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేములకు న్యాయం చేయాలని, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) సంక్షోభానికి నిరసనగా దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు.

02/24/2016 - 01:10

న్యూఢిల్లీ: గొడవ గందరగోళాలతో పార్లమెంటు సమావేశాలను దెబ్బతీయటాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. సభ్యులు పరస్పర సహకారం, సర్దుకుపోవటం ద్వారా ఉభయ సభలు సజావుగా సాగేలా చూడాలని హితవు చెప్పారు. మంగళవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా బడ్జెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు.

02/24/2016 - 01:07

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫలప్రదంగా సాగుతాయని, నిర్మాణాత్మక చర్చ కోసం ఈ సమావేవాలను ఉపయోగించుకుంటరన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అపారంభమైన సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలతో జరిపిన చర్చల సందర్భంగా ప్రతిపక్షాల్లోని కొంతమంది మిత్రులు సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారని కూడా ఆయన చెప్పారు.

02/24/2016 - 01:00

న్యూఢిల్లీ: ఎన్ని ప్రలోభాలు పెట్టినా చంద్రబాబు తమ పార్టీనుంచి నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే లాక్కోగలిగారని వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగని 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ అన్నారు.

Pages