S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/23/2016 - 07:45

న్యూఢిల్లీ: పొరుగున ఉన్న నేపాల్‌ను పెద్దన్నలాగే భారత్ ఆదుకుంటుంది తప్ప, దానిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌పై వచ్చిన ఆరోపణలను ఆమె తిరస్కరించారు. నేపాల్‌కు ఎలాంటి కష్టం వచ్చినా అక్కున చేర్చుకున్న దేశాలలోభారత్ ఒకటని, ఎప్పుడూ ఆ దేశానికి ఇబ్బందులు కలిగించలేదని వెల్లడించారు.

02/23/2016 - 07:43

న్యూఢిల్లీ: చిన్న చిన్న సమస్యలను ప్రభుత్వాల స్థాయిలో పరిష్కరించుకోవడానికి బదులు ప్రతి విషయానికీ తమను ఆశ్రయిస్తున్న ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లకోసం జాట్ సామాజిక వర్గంవారు సాగిస్తున్న ఆందోళనల కారణంగా రాజధానికి ఆగిపోయిన నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కోరింది.

02/23/2016 - 07:42

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు విపక్షాలు ఎద్దేవా చేశాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరచాల్సి అవసరం తమకు ఎంతమాత్రం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ప్రధాని ఆత్మరక్షణలో చేసిన ఆరోపణలే తప్ప విపక్షాలకు అలాంటి చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు.

02/23/2016 - 07:41

న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఇతర పనులకు వినియోగించడానికి వీలులేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడం, తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ‘ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్: నెక్స్ట్ స్టెప్స్’ అనే అంశంపై సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

02/23/2016 - 07:40

వారణాసి: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు, ఇంధన సంక్షోభం, భయంకరమైన వ్యాధులను సవాళ్లుగా స్వీకరించి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ‘కట్-పేస్ట్’ పద్ధతిలో కాకుండా సృజనాత్మక పరిశోధనల ద్వారా ఈ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని ఆయన సూచించారు.

02/23/2016 - 07:39

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ సామాజికవర్గ ప్రజలు సాగిస్తున్న ఆందోళనలతో అట్టుడుకుతున్న హర్యానాలో సోమవారం కూడా హింసాకాండ కొనసాగింది. గత తొమ్మిది రోజుల నుంచి సాగుతున్న ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య 19గానే ఉన్నప్పటికీ ఆందోళనకారులు సోమవారం భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడటంతో పాటు ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు.

02/23/2016 - 07:11

న్యూఢిల్లీ: నీటి ప్రాజెక్టులకు కేంద్రం సకాలంలో అనుమతుల ఇవ్వకపోవటం వల్లే ప్రాజెక్టుల ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. నిర్మాణంలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరగటంతోపాటు ప్రజలకు సకాలంలో నీరందటం లేదని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

02/23/2016 - 06:19

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో దాడులకు తెగబడిన ఉగ్రవాదులను ఎట్టకేలకు ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. సోమవారంతో ఆర్మీ ఆపరేషన్ ముగిసింది. శ్రీనగర్ నగర్ శివార్లలో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారి పక్కనున్న ఎంటర్‌ప్రీనర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఇడిఐ) భవనంలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి భవనాన్ని స్వాధీనపర్చుకున్నాయి. 48 గంటలకు పైగా ఆర్మీ ఆపరేషన్ సాగింది.

02/23/2016 - 06:17

న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా హర్యానాలో జరుగుతున్న జాట్‌ల ఉద్యమం వల్ల మొత్తం ఉత్తర భారతానికి 34వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలాగే దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని పిహెచ్‌డి చాంబర్ అంచనా వేసింది.

02/23/2016 - 06:15

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు, పౌర సమాజం, విద్యార్థుల స్వేచ్ఛాగళాన్ని అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిని సోనియా ఎండగట్టారు. ఏ రకమైన స్వేచ్ఛ, ప్రశ్నించే తత్వం, చర్చ, అసమ్మతికి తావులేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

Pages