S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/21/2016 - 18:53

న్యూదిల్లి:ఒబిసిలుగా జాట్లకు రిజర్వేషన్ కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళో, రేపో ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుంది. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో జాట్ ప్రతినిధులు, హర్యానా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన చర్చలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

02/21/2016 - 18:52

న్యూదిల్లీ: జెఎన్‌యులో జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ఉగ్రవాది అఫ్జల్‌గురు అనుకూల కార్యక్రమాలు చేపట్టడాన్ని నిరసిస్తూ వేలాదిమంది ఆదివారంనాడు న్యూదిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెఎన్‌యు విద్యార్థిసంఘం నాయకుడు కన్నయ్య, అతడి మద్దతుదార్లకు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేశారు. రాజ్‌ఘాట్‌నుంచి జంతర్‌మంతర్‌వరకు సాగిన ఈ ర్యాలీలో దాదాపు 25వేలమంది పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు

02/21/2016 - 15:30

చెన్నై: డిఎంకె, పిఎంకె, తమిళ పుథియ పార్టీలకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామాలు చేశారు. వీరంతా అధికార అన్నాడిఎంకె పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.

02/21/2016 - 15:30

శ్రీనగర్: ఇక్కడి ప్యాంపోర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనం వద్ద సైనికులు, ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆదివారం మరో జవాను మృతి చెందాడు. శనివారం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభం కాగా నలుగురు జవాన్లు మరణించారు. భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు పోలీసులు అక్కడ ఉంటూ కాల్పులు జరుపుతున్నారు.

02/21/2016 - 14:12

నయారాయ్‌పూర్ : పల్లెలనుంచి వలసలు పెరిగిపోతూండటంతో పట్టణాలకూ నగరశోభ అందించేందుకు ఉద్దేశించిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లోని డాంబర్‌గఢ్‌లో దీనికి శ్రీకారం చుట్టారు. పట్టణాలకు ప్రజల వలస పెరిగిపోతోందని, మెరుగైన జీవనప్రమాణాలకోసం తగినట్లు నగరాలను అభివృద్ధి చేయాలని, అందుకే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

02/21/2016 - 14:10

న్యూదిల్లి:ఒబిసి రిజర్వేషన్లలో చోటు కల్పించాలని కోరుతూ జాట్‌లు చేపట్టిన హింసాత్మక ఆందోళన ఎనిమిదవరోజు (ఆదివారం) ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతోంది. సైన్యం పహారా, కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఆందోళనకారుల పేరుతో అల్లరిమూకలు దీనికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా విధ్వంసకాండతో రోహ్‌తక్ పట్టణం పూర్తిగా దెబ్బతింది.

02/21/2016 - 14:10

న్యూదిల్లీ:జాట్‌ల ఆందోళన ఫలితంగా దేశ రాజధాని దిల్లీలో నీటి కటకట ఏర్పడింది. హర్యానానుంచి వచ్చే నీటిసరఫరా వ్యవస్థను ఆందోళనకారులు నిన్న ధ్వంసం చేయడంతో ఇవాళ దిల్లీలో మంచినీటి కొరత తీవ్రరూపం దాల్చింది. కాగా ఈ పరిస్థితుల్లో దిల్లీలో సోమవారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వీలైనంతగా నీటిని పొదుపు చేయాలని ప్రజలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

02/21/2016 - 13:06

న్యూదిల్లి:ఒబిసిలుగా రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జాట్ కులస్థులు చేపట్టిన ఆందోళన వరుసగా ఏడోరోజూ కొనసాగుతోంది. హర్యానాలోని రోహ్‌తక్ సహా ఎనిమిది జిల్లాల్లో పరిస్తితి అట్టుడుకుతోంది. ఎక్కడికక్కడ రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలు స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అల్లర్లు, కాల్పుల్లో ఎనిమిది మరణించారు. దాదాపు 700 రైళ్లు రద్దయ్యాయి.

02/21/2016 - 13:03

న్యూరాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆప్ నేత, గిరిజన హక్కుల ఉద్యమకారిణి సోనిసోరిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌దాడికి పాల్పడ్డారు. వారు వాడిన రసాయనం పూర్తిగా యాసిడ్ కాదని, తారులాంటి పదార్థమని వైద్యులు చెప్పారు. ఈ దాడిలో ఆమె ముఖంపై నల్లని గాయాలయ్యాయి.

02/21/2016 - 09:01

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో స్థానిక కోర్టు శనివారం నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మాజీ చైర్మన్ శామ్ పిట్రోడాకు బెయిలు మంజూరు చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఈ కేసులో వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది.

Pages