S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/20/2016 - 01:48

రోహ్టక్, ఫిబ్రవరి 19: హర్యానాలో జాట్ల రిజర్వేషన్ ఉద్యమం శుక్రవారం ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోని అనేక చోట్ల, హింస, విధ్వంసకాండ చెలరేగడంతో సైనిక దళాలను రంగంలోకి దింపారు, వివిధ సంఘటనల్లో ముగ్గురు మరణించిన నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క ఆందోళనకారులు రాష్ట్ర హోం మంత్రి ఇంటినే దగ్ధం చేయడంతో అనేక చోట్ల కర్ఫ్యూ విధించారు.

02/20/2016 - 01:47

శ్రీనగర్, ఫిబ్రవరి 19: కాశ్మీర్‌లో శుక్రవారం అల్లర్లు జరగడం మామూలే అయినా ఈ శుక్రవారం మాత్రం జెఎన్‌యు ఘటనకు మద్దతు పలుకుతూ కొత్త దారులు తొక్కాయి. అఫ్జల్ గురు ఉరిశిక్షకు నిరసనగా జెఎన్‌యులో కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులకు ధన్యవాదాలు చెబుతూ ఆందోళనకారులు బ్యానర్లు ప్రదర్శించారు.

02/20/2016 - 01:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిలు పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని సత్వరం పరిష్కరించాలని హైకోర్టును కోరింది.

02/20/2016 - 01:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది లాయర్లు శుక్రవారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో గత సోమ, బుధవారాల్లో జర్నలిస్టులు, జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేసిన లాయర్లు కూడా ఉండడం విశేషం.

02/20/2016 - 01:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కేంద్ర ప్రభుత్వం వచ్చే మంత్రివర్గం సమావేశంలో రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని 3 నుంచి 3.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే రాష్ట్రానికి సిఎస్‌టి నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి దాదాపు రెండు వేల కోట్ల బకాయిలు రావలసి ఉందని ఆయన తెలిపారు.

02/20/2016 - 00:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి, అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.

02/20/2016 - 00:58

కోరాపుట్, ఫిబ్రవరి 19:బేషరతుగా హింసాకాండను విడనాడే పక్షంలో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారంనాడిక్కడ స్పష్టం చేశారు.హింసాత్మక కార్యకలాపాలకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులను అభ్యర్థిస్తున్నానని తెలిపారు.

02/20/2016 - 00:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: గత కొన్ని సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న మావోయిస్టు సమస్య ఒడిశా, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ తలెత్తే అవకాశం ఉందని సిఆర్‌పిఎఫ్ నక్సల్ నిరోధక ఆపరేషన్ల డిజిపి ప్రకాశ్ మిశ్రా స్పష్టం చేశారు. వామపక్ష ఉగ్రవాద పీడిత రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు ఇందుకు సంబంధించి బలమైన సంకేతాలు అందిస్తున్నాయని తెలిపారు.

02/19/2016 - 20:13

న్యూదిల్లి:హర్యానాలో జాట్ ఆందోళన హింసాత్మకంగా మారడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముఖ్యంగా రోహ్‌తక్, భివాని, హిసార్, సోనెపట్, జజ్జర్ ప్రాంతాల్లో సైన్యాన్ని రప్పించారు. ఒబిసి కోటాలో చేర్చడం లేదా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టిన జాట్‌లు శుక్రవారం రాష్ట్ర ఆర్థికమంత్రి ఇంటిపై దాడికి పాల్పడి వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.

02/19/2016 - 20:13

న్యూదిల్లి:అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు దీనితో మార్గం సుగమమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లో యథాతథ స్థితి కొనసాగించాలన్న ఆదేశాన్ని రద్దు చేస్తూ నిన్న సుప్రీంకోర్టు నిర్ణయించడంతో ఇది సాధ్యమైంది.

Pages