S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/19/2016 - 18:17

దిల్లీ: జెఎన్‌యులో తాజా పరిణామాలు, దేశద్రోహం కేసులు, మతతత్వం వంటి అంశాలపై ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. ఈరోజు ఇక్కడ సిపిఎం నేత సీతారాం ఏచూరి, సిపిఐ నేత సురవరం సుధాకరరెడ్డి సమావేశమై ఆందోళన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. మతతత్వ శక్తుల ఒత్తిడితో కేంద్రంలో బిజెపి పాలన సాగుతోందని వారు ఆరోపించారు.

02/19/2016 - 18:16

దిల్లీ: ఈ నెలాఖరులో పార్లమెంటులో వార్షిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం ఆర్థిక శాఖ ఉద్యోగులకు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హల్వా పంపిణీ చేశారు. బడ్జెట్ ముందు హల్వా తయారు చేసి ఉద్యోగులకు పంచడం సంప్రదాయంగా వస్తోంది.

02/19/2016 - 18:16

విశాఖ: జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధపడితే మావోయిస్టులతో రాజ్యాంగం పరిధిలో చర్చలు జరిపేందుకు తాము సుముఖంగానే ఉన్నామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన విశాఖలో శుక్రవారం మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఎపి, ఒడిశాతో పాటు దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రజల క్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంతో సహకరించాలని మావోలకు ఆయన సూచించారు.

02/19/2016 - 16:40

దిల్లీ: జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను అన్నివర్గాల వారూ ఖండించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడ పెద్ద సంఖ్యలో లాయర్లు ర్యాలీ జరిపారు. ఉగ్రవాది అఫ్జల్‌గురుకు మద్దతుగా మాట్లాడడడం నిజంగా దేశద్రోహమేనని వారు అన్నారు. కాగా, తీహార్ జైలులో ఉన్న కన్నయ్య ఈరోజు తన న్యాయవాది ద్వారా దిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

02/19/2016 - 16:40

దిల్లీ: కేంద్రంలో బిజెపి సర్కారు అవలంబిస్తున్న విధానాల వల్లనే దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అశాంతి, అభద్రత చోటుచేసుకున్నాయని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, జెఎన్‌యులో పరిణామాలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు.

02/19/2016 - 16:37

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ కులస్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. రోహతక్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు ఇంటికి ఆందోళనకారులు శుక్రవారం నిప్పుపెట్టారు. అయితే, సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆర్థికమంత్రి ఇంటికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు.

02/19/2016 - 12:59

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కన్నయ్య పిటిషన్‌పై శుక్రవారం కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించడమే గాక, బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

02/19/2016 - 12:58

దిల్లీ: ముంబయిలో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి కొందరి మృతికి కారకుడయ్యాడనే (హిట్ అండ్ రన్) కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సల్మాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ ముంబయి హైకోర్టు కేసును గతంలోనే కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసుపై నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు మళ్లీ విచారణ చేపడుతుందా? లేక హైకోర్టు తీర్పును సమర్ధిస్తుందా?

02/19/2016 - 12:04

బెంగళూరు: ఓ ట్రక్కు అదుపుతప్పి 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ సమీపంలోని బందనాయకల హళ్ళి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. ఇనుప చువ్వల లోడుతో వెళ్తున్న ట్రక్కు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇనుప చువ్వలు శరీరంలోకి దిగబడటంతో వీరంతా మరణించారు.

02/19/2016 - 12:03

ముంబయి : నగరంలోని కుర్లా -విద్యా విహార్ స్టేషన్ల మధ్య శుక్రవారం వేకువజామున ఓ లోకల్ రైలు దూసుకుపోవడంతో పట్టాలపై మరమ్మతులు చేస్తున్న నలుగురు గ్యాంగ్‌మెన్లు అక్కడికక్కడే మరణించారు. తెల్లవారుజామున చీకటిగా ఉండటంతో రైలు రావడాన్ని గ్యాంగ్‌మెన్లు గమనించి ఉండకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

Pages