S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/17/2016 - 07:36

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ అధ్యాపకుడు ఎస్‌ఎఆర్.గిలానీని స్థానిక కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించింది. న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి గిలానీని దేశద్రోహ అభియోగాలతో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు మంగళవారం గిలానీని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్వీందర్ సింగ్ ఎదుట హాజరుపరిచారు.

02/17/2016 - 07:20

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అంశాలతోపాటు దేశం ముందున్న అన్ని సవాళ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను ఒక పార్టీకి ప్రధానిని కాదని, దేశానికి ప్రధానిని కనుక విపక్షాలు ప్రస్తావించే అంశాలపైనా పార్లమెంట్‌లో చర్చ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

02/17/2016 - 07:15

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కేంద్రంతోపాటు ప్రతిభా పాఠశాల ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేవలం చాంబర్‌తో చర్చలు జరిపేందుకే ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీకి రావటం గమనార్హం. దాదాపు అర్థగంట పాటు సిస్కో చైర్మన్‌తో చర్చలు జరిపారు.

02/17/2016 - 07:39

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) తమ చందాదారులకు తీపికబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచుతున్నట్లు మంగళవారం ఇపిఎఫ్‌ఓ ప్రకటించింది. పిఎఫ్ డిపాజిట్లపై గత రెండేళ్లు చెల్లించిన 8.75 శాతం వడ్డీ కంటే ఇది 0.13 శాతం ఎక్కువ.

02/17/2016 - 06:39

న్యూఢిల్లీ: ఏడవ వేతన సంఘం సిఫార్సులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఏడవ వేతన సంఘం సిపార్సులను పరిశీలిస్తున్న కార్యదర్శుల సాధికారిక కమిటీ వేతన సంఘం సిఫార్సు చేసిన వేతనాల పెంపును రెట్టింపు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

02/16/2016 - 15:50

న్యూదిల్లి:దిల్లీలోని ఓ కోర్టుకు హాజరైన విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది, జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి కొందరు జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. నిన్న జరిగిన సంఘటనల్లో దాడికి పూనుకున్నవారి వివరాలు వీడియోఫుటేజ్‌లో ఉన్నా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఇవాళ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన జర్నలిస్టులు ఆరోపించారు.

02/16/2016 - 15:48

న్యూదిల్లి:జెఎన్‌యు సంఘటనలు, రాజకీయ వివాదంపై మోదీ స్పందించాలని విపక్షాలు కోరాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విపక్ష నేతలతో మోదీ సమావేశమైనప్పుడు వారు ఈసూచన చేశారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ తాను ఒక పార్టీ నేతను కాదని, దేశానికి నాయకుడిగా తప్పనిసరిగా జోక్యం చేసుకుంటానని హామీ ఇచ్చారు.

02/16/2016 - 14:23

ముజఫర్‌నగర్:సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ముజఫర్ నగర్ అసెంబ్లీ నియోజికవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి విజయం సాధించారు. ఇటీవలికాలంలో అల్లర్లు చెలరేగిన ఇక్కడ బిజెపి గెలవడం విశేషం. గతంలో ఇక్కడ సమాజ్‌వాది అభ్యర్థి గెలిచారు. కాగా ఈ సీటును కోల్పోవడం ఆ పార్టీకి దెబ్బే. వచ్చే ఏడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితం బిజెపికి ఆశలు చిగురింపచేసిందనే చెప్పాలి.

02/16/2016 - 02:52

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 15: అమెరికా నుండి తెలుగు విద్యార్ధులను వెనక్కి పంపడంపై రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు రాసిన లేఖపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. అమెరికా వెళ్లే విద్యార్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న ఆ దేశ సెంటర్లలలో గైడెన్స్ తీసుకోవాలని తెలిపారు. ఈ అంశంపై తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపినట్లు హనుమంతురావుఇచ్చిన సమాధానంలో సుష్మ పేర్కొన్నారు. సమాధానం ఇచ్చారు.

02/16/2016 - 02:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: హర్యానాలో జరుగుతున్న అంతర్జాతీయ సూరజ్‌కుండ్ హస్తకళాల మేళా సోమవారం ముగిసింది. పదిహేను రోజులపాటు ఆకట్టుకున్న ఈ మేళాకు తెలంగాణ రాష్ట్రం థీమ్ స్టేట్‌గా ఉన్న సంగతి విదితమే. మేళా ముగింపు వేడుకలకు కడియం శ్రీహరి హాజరయ్యారు.

Pages