S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/15/2016 - 14:51

న్యూదిల్లి:ఆంధ్రప్రదేశ్‌లో కరవు సహాయక చర్యలకోసం రూ.280.19 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, రాజస్థాన్‌లకు 1100 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లిసహా పలువురు ప్రముఖులు హాజరైన సమావేశంలో ఈ కేటాయింపులు చేశారు.

02/15/2016 - 02:23

శ్రీనగర్, ఫిబ్రవరి 14: కాశ్మీర్‌లో తమపైకి రాళ్లు రువ్వుతున్న ఒక గుంపుపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒక బాలిక కూడా ఉంది. అంతకుముందు దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక గుర్తు తెలియని మిలిటెంట్ మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కకపొర ప్రాంతంలోని లిల్‌హార్‌లో కొంతమంది ప్రజలు ప్రదర్శన తీశారు.

02/15/2016 - 02:20

ముంబయి, ఫిబ్రవరి 14: అమెరికా ఎప్పటినుంచో పాకిస్తాన్‌కు పౌర, సైనిక పరికరాలను, ఆయుధాలను విక్రయిస్తూ వస్తోందని, అందులో భాగంగానే ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని ఇటీవల నిర్ణయించిందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా వారోత్సవాలలో భాగంగా ఆదివారం ఇక్కడ నిర్వహించిన సిఎన్‌ఎన్ ఆసియా బిజినెస్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

02/15/2016 - 02:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాల్లో రెండో విడతగా 25 ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే బహిర్గతం చేసే అవకాశం ఉందని సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. నేతాజీ మరణం విషయంలో అనేక అనుమానాలు తలెత్తిన దృష్ట్యా ఈ రహస్య ఫైళ్లను నెలకు 25 చొప్పున బహిర్గతం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

02/15/2016 - 01:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుకునే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హిందూ గ్రూపులను బలంగా ఆకట్టుకోవాలని, ఆ రకంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

02/15/2016 - 01:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రేమికుల రోజయిన వాలెంటైన్స్‌డేను ఆదివారం దేశవ్యాప్తంగా వయో భేదం లేకుండా పెళ్లికాని ప్రేమ జంటలు, పెళ్లయినవారు, వృద్ధులు సైతం ఉత్సాహంగా జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో వాలెంటైన్స్‌డేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరుపుతున్న పలువురు విహెచ్‌పి, బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు.

02/15/2016 - 01:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మళ్లీ తమ అసలు బాధ్యతలను నిర్వర్తించే దిశగా ముందుకు సాగుతున్న ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డు) దళం వివిఐపి భద్రతా విభాగం నుంచి 600 మంది కమెండోలను ఉపసంహరించుకుని వారిని ఇటీవల పంజాబ్‌లోని పటాన్‌కోఠ్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేతకు ఉపయోగించింది.

02/15/2016 - 01:41

శ్రీనగర్, ఫిబ్రవరి 14: అఖిల భారత హురియత్ కాన్ఫరెన్స్ వేర్పాటువాద వర్గం చైర్మన్ సయ్యద్ అలీ షా జిలానీకి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారినుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని ఆదివారం మీడియా కథనాలు పేర్కొన్నాయి.

02/15/2016 - 01:41

శ్రీనగర్, ఫిబ్రవరి 14: గతంతో పోలిస్తే నియంత్రణ రేఖ అవతలివైపు నుంచి కాశ్మీర్‌లోకి చొరబాట్లు గణనీయంగా తగ్గాయని ఆర్మీ తెలిపింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ అవతలివైపు నుంచి కాశ్మీర్ లోయలోకి చొరబడటానికి వేచిచూస్తున్న ఉగ్రవాదుల సంఖ్య వందలోపే ఉందని శ్రీనగర్‌లోని చినార్ కాప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఒసి) లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా చెప్పారు.

02/15/2016 - 01:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై జాతి వ్యతిరేక కార్యకలాపాల కేంద్రం అనే ముద్ర వేయొద్దని విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రజలను కోరారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ విశ్వవిద్యాలయ ఆవరణలో ఇటీవల ఓ కార్యక్రమాన్ని నిర్వహించడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో వర్శిటీ అధ్యాపకులు స్పందించారు.

Pages