S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/14/2016 - 08:22

ముంబయి: కళలు కాలానికి, కులం, మతం, ప్రాంతాలకు అతీతమైనవని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, కళలను సామాన్యులకు చేరువగా తీసుకురావాలని, స్వచ్ఛ్భారత్‌లాంటి అంశాలపై సామాజిక సందేశాలను వ్యాప్తి చేయడానికి వాటిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

02/14/2016 - 08:18

ముంబయి: లష్కరే తోయిబా సీనియర్ నేతలు జకీవుర్ రెహమాన్ లఖ్వీ, హఫీజ్ సరుూద్‌లకు ఏమీ కాదని, 26/11 ముంబయి దాడుల కేసులో పాకిస్తాన్ ఫెడరల్ దర్యాప్తు ఏజెన్సీ వారిపైన, ఇతర లష్కరే తోయిబా నేతలపైనా తీసుకున్న చర్యలు అన్నీ కంటితుడుపు చర్యలేనని ఐఎస్‌ఐలో తనతో వ్యవహారాలు సాగించిన నేతలు తనకు చెప్పారని ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హెడ్లీ చెప్పాడు.

02/14/2016 - 08:17

అలహాబాద్: పాకిస్తాన్‌లో ప్రభుత్వేతర శక్తులంటూ ఎవీ లేవని, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నిధులతో సాగుతున్న సీమాంతర ఉగ్రవాదమే ఉందని ముంబయి కోర్టు ఎదుట పాక్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలాలు రుజువు చేస్తున్నాయని బిజెపి అంటూ, పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

02/14/2016 - 08:16

న్యూఢిల్లీ: జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ డిగ్రీ పట్టాలు వెనక్కి ఇచ్చేస్తామంటూ మాజీ సైనికులు ప్రకటించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పార్లమెంటుపై దాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.

02/14/2016 - 08:16

బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో జాతి వ్యతిరేక శక్తులను కఠినంగా అణచివేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి అనంతకుమార్ అన్నారు. ‘జెఎన్‌యులో జాతి వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన వారిని శిక్షించాలి. పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌గురుకు మద్దతుగా నినాదాలు చేసిన వారిపట్ల కఠినంగా ఉండాలి.

02/14/2016 - 08:13

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీచేయాలని డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ డిఎంకె అధినేత ఎం కరుణానిధితో సమావేశమై ఎన్నికల పొత్తుపై తమ అంగీకారం తెలిపారు. లంకలో తమిళుల అంశంపై మూడేళ్ల క్రితం రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ‘మా కేంద్ర నాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకెతో కలిసి నడవాలని నిర్ణయించింది.

02/14/2016 - 07:17

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్ శనివారం భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను శనివారం ఇక్కడి సౌత్ బ్లాక్ కార్యాలయానికి పిలిపించి తమ అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేశారు. అమెరికా పాకిస్తాన్‌కు సైనిక సహాయం చేయడం పట్ల భారత్‌కు ఉన్న ఆందోళనను తెలిపారు.

02/14/2016 - 03:15

న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభ స్థానాలు పెంపు బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు కేంద్ర హోంమంత్రి రాజన్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహ్నం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిసి, విభజన చట్టం హామీలను గుర్తు చేశారు.

02/14/2016 - 02:58

ముంబయి: అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్ తయారుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే, విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గ్ధామమన్నారు. నిలకడయిన, ముందే ఊహించగలిగే పన్నుల విధానాన్ని తీసుకొస్తున్నట్టు పెట్టుబడిదారులకు ప్రధాని హామీ ఇచ్చారు.

02/14/2016 - 02:53

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌ను సందర్శించి అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. దేశద్రోహం ఆరోపణలపై జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యా కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన ఒకరోజు తర్వాత రాహుల్ జెఎన్‌యు క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం.

Pages