S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/14/2016 - 02:45

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేయడానికి నిర్వహించిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు శనివారం అయిదుగురు మిలిటెంట్లను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా చౌకిబల్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మిలిటెంట్ల ఏరివేత కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని సైనికాధికారి ఒకరు చెప్పారు.

02/13/2016 - 20:05

తిరువనంతపురం:జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, మలయాళ సినీ రచయిత, సామాజికవేత్త ఒఎన్‌వి కురూప్ కన్నుమూశారు. రెండురోజుల క్రితం స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూండగా శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. 200 సినిమాల్లో 900 పాటలు రాసిన ఆయన మంచి కవి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఆయన పనిచేశారు.

02/13/2016 - 19:52

న్యూదిల్లి:జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలు, దానికి వ్యతిరేకంగా ఒకవర్గం విద్యార్థులు చేపట్టిన ఆందోళనల దరిమిలా అసలు ఏం జరిగిందన్నది రాబట్టడానికి మెజిస్టీరియల్ విచారణకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆదేశించారు.

02/13/2016 - 19:41

ముంబై:ప్రపంచంలోనే తయారీరంగ కేంద్రంగా భారత్ తయారవ్వాలని ప్రధఆని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 65శాతం మంది యువతేనని, అందువల్ల దూకుడుగా పనిచేస్తే ఆ లక్ష్యం సాధించడం కష్టం కాదని ఆయన అన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మేకిన్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించడంపట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

02/13/2016 - 19:39

న్యూదిల్లి:జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసుల చర్యకు నిరసనగా దీక్ష చేస్తున్న ఆందోళనకారులకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సంఘీభావం ప్రకటించారు. శనివారం సాయంత్రం ఆయన జెఎన్‌యులో విద్యార్థులను కలిశారు. కాగా ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఎబివిపి విద్యార్థులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.

02/13/2016 - 15:42

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. పరారైన మావోల కోసం పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

02/13/2016 - 13:58

న్యూదిల్లి:దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో దేశవ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా తమ డిగ్రీ పట్టాలను వెనక్కి ఇచ్చేస్తామని మాజీ సైనికాధికారులు హెచ్చరించారు. శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటి అయినవారు ఈ మేరకు స్పష్టం చేశారు. యూనివర్శిటీలో తీవ్రవాద అనుకూల పరిణామాలపట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జెఎన్‌యులో విద్యార్థులపై చర్య తీసుకోవడాన్ని సిపిఎం తప్పుబట్టింది.

02/13/2016 - 13:57

పాట్నా:బీహార్‌లో శుభకార్యానికి వెళ్లి వస్తున్నవారి వాహనం ప్రమాదానికి గురై 11మంది దుర్మరణం పాలయ్యారు. భోజ్‌పూర్‌లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తూండగా ట్రాక్టర్‌న ఓ ట్రక్ ఢీకొట్టగా 11మంది అక్కడికక్కడే మరణించారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.

02/13/2016 - 12:19

శ్రీనగర్: ఉగ్రవాదులు, సైనిక సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కుప్వా జిల్లాలో మర్‌శేరి గ్రామం వద్ద ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని తెలియడంతో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు అక్కడికి వెళ్లారు. ఉభయ వర్గాల మధ్య కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరిని సైనిక ఆస్పత్రికి తరలించారు.

02/13/2016 - 03:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి బాలరాజు శుక్రవారం ఇక్కడ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఏపిలో సంభవించిన పరిణామాలు, రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు చెప్పారు.

Pages