S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/05/2016 - 12:57

న్యూఢిల్లీ :‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌హెచ్‌ కపాడియా అనారోగ్యంతో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కపాడియాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ముంబయిలో జరగనున్నాయి.

01/05/2016 - 11:44

చండీగఢ్: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో చొరబడిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మంగళవారం నాలుగో రోజు కూడా సైనికులు వేట కొనసాగిస్తున్నారు. ఇంతవరకు ఆరుగురు ఉగ్రవాదులు హతమయినట్లు, మరి కొందరు ఇంకా అటవీ ప్రాంతంలో పొంచి ఉన్నట్లు సైనిక బలగాలు అనుమానిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌ఎస్‌జి కమాండోలు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ల పై నుంచి కూడా ఉగ్రవాదుల కోసం ఆరా తీస్తున్నారు.

01/05/2016 - 07:04

న్యూఢిల్లీ, జనవరి 4: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై దాడికి తెగబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండో-పాక్ సరిహద్దు వెంబడి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సహకారంతో భారత్‌లోకి చొరబడ్డారని, ముష్కరులు ఈ దాడికి ఉపయోగించిన భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి వారు సరిహద్దు దాటకముందే పాకిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్నాయన్న అనుమానాలు క్రమేణా బలపడుతున్నాయి.

01/05/2016 - 06:57

న్యూఢిల్లీ, జనవరి 4: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మాజీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌కు శనివారం ఇక్కడ నిగంబోధ్ ఘాట్‌లోని విద్యుత్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ పద్ధతిలో ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బర్దన్ శనివారం కన్నుమూశారు. దివంగత నేతకు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి ఘన నివాళులర్పించారు.

01/05/2016 - 06:55

న్యూఢిల్లీ, జనవరి 4: దేశ అంతర్గత భద్రతపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల నుంచి ఎయిర్‌బేస్ లాంటి వ్యూహాత్మక స్థావరాలను పరిరక్షించుకోవాల్సి ఉందన్న సోనియా ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిని తిప్పికొట్టిన భద్రతా సిబ్బందిని కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రశంసించారు.

01/05/2016 - 06:54

న్యూఢిల్లీ, జనవరి 4: భారత దేశ ఎనిమిదవ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కె.మాథుర్ (62) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. త్రిపుర క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన 62 ఏళ్ల మాథుర్ రక్షణ శాఖ కార్యదర్శిగా రెండేళ్ల పదవీ కాలాన్ని గత ఏడాది మే నెలలో పూర్తి చేశారు.

01/05/2016 - 06:52

అంబాలా/ బెంగళూరు, జనవరి 4: పాకిస్తాన్ ముష్కర మూకలనుంచి పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని కాపాడే ప్రయత్నంలో నేలకొరిగిన అమర జవాన్లకు సోమవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పూర్తి అధికార లాంఛనాలతో జరిగిన అంత్యక్రియలలో సమర వీరులకు తుడి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.

01/05/2016 - 06:51

న్యూఢిల్లీ, జనవరి 4: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో దాడికి తెగబడిన ఉగ్రవాదులు ‘ఎంతో శిక్షణ’ పొందినవారని, 2008లో ముంబయిలో నరమేథానికి పాల్పడి వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరుల కంటే వీరు ఎంతో ఆరితేరిన వారని, పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో వచ్చిన ఉగ్రవాదులు వైమానిక స్థావరానికి భారీ నష్టం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారితో భద్రతా దళాలు జరిపిన సుదీర్ఘ పోరాటాన్ని బ

01/05/2016 - 05:38

పఠాన్‌కోట్, జనవరి 4: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో మరో ఇద్దరిని సోమవారం భద్రతా దళాలు హతమార్చాయి. మూడు రోజుల నుంచి పోరాడుతున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నాయి. పఠాన్‌కోట్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు నక్కివున్నట్టు సమాచారం ఉన్నా, కేంద్రంగానీ సైనిక బలగాలుగానీ స్పష్టంగా ప్రకటించలేపోతున్నాయి.

01/05/2016 - 05:33

ఇంఫాల్, జనవరి 4: భారీ భూకంపం వల్ల ఈశాన్య భారతం సోమవారం అతలాకుతలమయింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 8మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. మణిపూర్ కేంద్రంగా తెల్లవారుజామున 4.35కు సంభవించిన భూకంపం వల్ల అనేక భవనాలు కూలిపోయాయి. ప్రజలు భీతావహులయ్యారు. మణిపూర్‌లోని టామెంగ్‌లాంగ్ జిల్లాలో భూమి ఉపరితలం నుంచి 17 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

Pages