S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/12/2016 - 11:56

ముంబయి : ముంబయి దాడుల కుట్ర కేసులో అప్రూవర్‌గా మారి ప్రస్తుతం అమెరికాలోని జైలులో ఉంటున్న డేవిడ్ హెడ్లీ నాలుగో రోజు శుక్రవారం కూడా ఇక్కడి న్యాయమూర్తితో వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పాల్గొని మరిన్ని విషయాలు బయటపెట్టాడు. 2008 ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు తాను పాకిస్తాన్‌లో ఉన్నానని, ముంబయిలో దాడులకు సంబంధించి పలువురు వ్యక్తులతో తాను ఫోన్‌లో సంభాషించానని న్యాయమూర్తికి వివరించాడు.

02/12/2016 - 11:55

ముంబయి : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ 1.93 లక్షల జరిమానా విధించిన విషయం సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి సేకరించిన సమాచారంతో ఆలస్యంగా బయటపడింది. దాదాపు రెండేళ్ల క్రితం షారుఖ్ తన ఇంటి బయట రోడ్డును ఆక్రమించి ర్యాంప్‌ను నిర్మించటంతో మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీచేసింది. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో ర్యాంప్‌ను మున్సిపల్ ఉద్యోగులు ధ్వంసం చేశారు.

02/12/2016 - 06:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే అంశాలపై గవర్నర్‌కు ఎలాంటి అధికారం ఉండదని, అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచి ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

02/12/2016 - 06:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్ సమక్షంలో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వేద్‌ప్రకాశ్ దుదేజా, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఒప్పందంపై సంతకాలు చేశారు.

02/12/2016 - 05:49

ముంబయి: పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్, లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీ గురువారం ముంబయి కోర్టు ముందు విచారణలో ఒక కీలక అంశాన్ని వెల్లడించాడు. 2004లో గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇషత్ జహాన్ ఎల్‌ఇటి ఉగ్రవాద సంస్థకు చెందిన మానవబాంబేనని తెలిపాడు. ఇషత్ జహాన్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

02/12/2016 - 05:48

ధార్వాడ్: సియాచిన్‌లో ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలతో బైటపడినప్పటినుంచి మృత్యువుతో పోరాటం జరిపిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప చివరికి గురువారం కన్ను మూశారన్న వార్త తెలియగానే ధార్వాడ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం శోకసంద్రంగా మారింది.

02/12/2016 - 05:47

న్యూఢిల్లీ: భారత దేశంలో ఇంటర్నెట్ తటస్థతకు మరింత ఊతం లభించింది. ఫ్రీబెసిక్స్‌తో కలకలం రేపిన ఫేస్‌బుక్ సంస్థ ఆ కార్యక్రమాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీసుల అందుబాటు విషయంలో ఎలాంటి అంతరాలు ఉండకూడదంటూ భారత్ టెలికామ్ నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ణయించిన నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ ప్రకటన చేసింది.

02/12/2016 - 05:45

న్యూఢిల్లీ: సియాచిన్‌పై ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని శాంతియుత రీతిలో పరిష్కరించుకోవాలంటూ పాకిస్తాన్ ముందుకొచ్చింది. మంచులోతుల్లో కూరుకుపోయి గురువారం జవాన్ హనుమంతప్ప మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ ప్రతిపాదన చేసింది. ఇరుదేశాలకు చెందిన సైనికులు హిమపాతానికి మరణించకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ‘సియాచిన్ సమస్య పరిష్కరించుకునే సమయం ఆసన్నమైంది.

02/12/2016 - 05:41

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై కోర్టు కేసులు ఎదుర్కొంటున్న రాజేంద్ర కె పచౌరిపై గతంలో ఆయన వద్ద పని చేసిన మరో మహిళా ఉద్యోగి కూడా గురువారం అలాంటి ఆరోపణలే చేసింది. తాజాగా ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి ‘ది ఎనర్జీ, రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (తేరి)లో 2003లో చేరింది. అప్పుడు పచౌరి ఆ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.

02/12/2016 - 05:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భారత్‌ను 2030 నాటికి మలేరియా రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా స్పష్టం చేశారు. మలేరియా నిర్మూలన కార్యక్రమానికి నిధుల కేటాయింపు పెంచినట్టు గురువారం ఇక్కడ చెప్పారు. పౌర సమాజాల భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు.

Pages