S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/12/2016 - 05:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలోని యువత ఇక ఏటా రెండుసార్లు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు జనవరి 1 అలాగే జూలై 1న ఓటర్లు నమోదుకావడానికి కటాఫ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటి వరకూ జనవరి 1 మాత్రమే ఉండేది. ఇక నుంచి జూలై 1వ తారీఖుతో 18 ఏళ్లు నిండినవారు ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చు.

02/12/2016 - 05:05

న్యూఢిల్లీ: సియాచిన్‌లో టన్నుల కొద్దీ మంచుకింద కూరుకు పోయిన అయిదు రోజుల తర్వాత కొన ప్రాణాలతో బైటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ గురువారం ఇక్కడి ఆర్మీ రిసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో మృతి చెందారు. లాన్స్‌నాయక్ హనుమంతప్ప ఇక లేరు. ఈ రోజు తెల్లవారుజామున 1.45 గంటలకు ఆయన చివరి శ్వాస విడిచారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

02/11/2016 - 19:56

న్యూదిల్లి:ఇప్పటిమాదిరిగా పీఎఫ్ డబ్బులకోసం దీర్ఘకాలంపాటు వేచి ఉండాల్సిన అవసరం ఇకముందు ఉండదు. ఆన్‌లైన్‌తో తమ పిఎఫ్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈపిఎఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆగస్టునుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక సర్వర్‌లను కొనుగోలు చేశారు. ఇప్పటికే డిజిటలైజేషన్ పని ప్రారంభమైంది.

02/11/2016 - 19:56

న్యూదిల్లి:కాలుష్య నివారణే లక్ష్యంగా మరోసారి దేశ రాజధాని దిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజలనుంచి వచ్చిన బ్రహ్మాండమైన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 15నుంచి పదిహేను రోజులపాటు ఈ విధానం అమల్లోకి వస్తుంది. మహిళలు, టూవీలర్లకు మినహాయింపు ఇస్తారు.

02/11/2016 - 18:13

న్యూదిల్లి:సియాచిన్ హిమపాతంలో చిక్కుకుని మృత్యువుతో పోరాడి అసువులు బాసిన సైనికుడు హనుమంతప్ప అంత్యక్రియలు శుక్రవారంనాడు ఆయన స్వగ్రామంలో నిర్వహించనున్నారు. మంచులో చిక్కుకున్న హనుమంతప్పను కొనఊపిరితో బయటకు తీసి నాలుగురోజులుగా చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. గురువారం ఉదయం ఆయన మరణించగా దేశం యావత్తు వీరసైనికుడికి నివాళి అర్పించింది.

02/11/2016 - 17:01

న్యూదిల్లీ-దేశ రాజధానిలో కాలుష్యానికి కళ్లెం వేయాలన్న లక్ష్యంతో జనవరిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన సరి-బేసి విధానాన్ని మరోసారి అమలు చేయాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి1నుంచి 15వ తేదీవరకు ఈ విధానాన్ని అమలు చేయగా ప్రజలనుంచి సానుకూల స్పందన లభించడంతో మరోసారి అమలు చేయాలని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

02/11/2016 - 17:01

న్యూదిల్లి- నెట్ న్యూట్రాలిటీని సమర్ధిస్తూ వివిధ రేట్ల విధానాన్ని అంగీకరించేది లేదని ట్రాయ్ స్పష్టం చేయడంతో ఫేస్‌బుక్ తలపెట్టిన ఫ్రీబేసిక్స్ పథకాన్ని భారత్‌లో అమలు చేయడం లేదని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. ట్రాయ్ నిర్ణయం నిరాశ కల్పించిందని ఆ సంస్థ అధిపతి జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.

02/11/2016 - 14:04

దిల్లీ: దేశ సరిహద్దుల్లోని సియాచిన్‌లో మంచు చరియల్లో చిక్కుకుని ఆరురోజుల తర్వాత బయటపడిన వీర సైనికుడు లాన్స్ నాయక్ గురువారం తుదిశ్వాస విడిచాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయనను సియాచిన్ నుంచి హెలికాప్టర్ ద్వారా దిల్లీలోని ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించి కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

02/11/2016 - 12:08

ముంబై: ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ గురువారం నాటి వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పలు కీలక అంశాలను న్యాయమూర్తికి వెల్లడించాడు. 2006 సెప్టెంబర్‌లో తాను భారత్‌కు వచ్చే ముందు ఐఎస్‌ఐ మేజర్ ఇక్బాల్ నుంచి 25 వేల డాలర్లను ముడుపులుగా తీసుకున్నానని, భారత సైనిక వ్యవస్థ రహస్యాలను సేకరించేందుకు ఖర్చు చేయాలని ఆ డబ్బు ఇచ్చారని ఆయన వివరించాడు.

02/11/2016 - 07:55

న్యూఢిల్లీ/జమ్ము: సియాచిన్ మంచు పర్వతాలలో పైన టన్నుల కొద్ది మంచుగడ్డలు కప్పివేయగా 25 అడుగుల లోతున ఆరు రోజుల పాటు కూరుకుపోయి ఉన్నప్పటికీ ఆర్మీ సహాయక బృందాలు వెలికితీసేంత వరకు ప్రాణాలను నిలుపుకున్న ధీరోదాత్తుడు, దృఢచిత్తుడు, దేహదారుఢ్యుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే అత్యంత భయానక పరిస్థితులనుంచి ప్రాణాలతో బయటికి రావడం అద్భుతమే..

Pages