S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/02/2016 - 06:25

న్యూఢిల్లీ, జనవరి 1: వంటగ్యాస్ వినియోగదారులకు సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే పద్ధతిని విజయవంతంగా అమలు చేసిన కేంద్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అదే పద్ధతిని కిరోసిన్ వినియోగదారులకు అమలు చేయనుంది. అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కిరోసిన్ వినియోగదారులు కూడా మార్కెట్ ధరపై కిరోసిన్‌ను కొనాల్సి ఉంటుంది. వారు పొందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

01/02/2016 - 06:02

న్యూఢిల్లీ, జనవరి 1: జాతీయ ఫిల్మ్ సెన్సార్ బోర్డు(సిబిఎఫ్‌సి) ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. బోర్డు పనితీరుపై ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్‌బెనెగల్ సారధ్యంలో ఓ ప్యానెల్ కమిటీ ఏర్పాటైంది. అలాగే సినీ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, పియూష్ నంది, సినీ విమర్శకుడు భవనా సోమాయలను కమిటీ సభ్యులుగా నియమించారు.

01/02/2016 - 06:01

న్యూఢిల్లీ, జనవరి 1: వంటగ్యాస్ వినియోగదారులకు సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే పద్ధతిని విజయవంతంగా అమలు చేసిన కేంద్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అదే పద్ధతిని కిరోసిన్ వినియోగదారులకు అమలు చేయనుంది. అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కిరోసిన్ వినియోగదారులు కూడా మార్కెట్ ధరపై కిరోసిన్‌ను కొనాల్సి ఉంటుంది. వారు పొందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

01/02/2016 - 06:00

న్యూఢిల్లీ, జనవరి 1: కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరాన్ని ‘ఎల్‌పిజి వినియోగదారుల సంవత్సరం’గా ప్రకటించింది. రానున్న మూడేళ్ల కాలంలో దేశంలోని అన్ని ఇళ్లకు శుద్ధమైన వంటగ్యాస్‌ను అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించిన ప్రణాళికలను శుక్రవారం ఆవిష్కరించింది. ఆన్‌లైన్‌లో వంట గ్యాస్ బిల్లు చెల్లించే సౌకర్యాన్ని ప్రారంభిస్తామని, పారదర్శక గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది.

01/02/2016 - 05:42

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక రంగంలో ఘోరంగా విఫలమైందని, 2015 సంవత్సరం ప్రారంభంలో 8.1 నుండి 8.5 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తామని ప్రకటించిన ప్రభుత్వం సంవత్సరాంతానికి ఇది ఏడు శాతానికి పడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం విమర్శించారు.

01/02/2016 - 05:40

న్యూఢిల్లీ, జనవరి 1: పాకిస్తాన్‌లో జన్మించి, గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో నివసిస్తున్న గాయకుడు అద్నాన్ షమీ శుక్రవారం భారత పౌరసత్వం పొందారు. ఇక్కడి నార్త్ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు చేతుల మీదుగా ఆయన పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సమయంలో 46 ఏళ్ల షమీతో పాటు ఆయన భార్య రోయా కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన తన బహుళ ప్రాచుర్యం పొందిన పాట ‘తేరీ ఊంచీ షాన్ హై వౌలా..

01/02/2016 - 05:36

న్యూఢిల్లీ, జనవరి 1: భారత పార్లమెంటులోని క్యాంటీన్లలో ఎంపీలు, విలేఖరులు, ఇతర ప్రముఖులకు ఇంత కాలం లభించిన రెండు కోట్ల అరవై మూడు లక్షల రాయితీకి కోత పడింది. పార్లమెంటు క్యాంటీన్లలోని ఆహార పదార్థాల రేట్లను 60 నుంచి 70 శాతానికి పెంచారు. పెంచిన రేట్లు వెంటనే అమలవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

01/02/2016 - 05:35

ముంబయి, జనవరి 1: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పుణె సమీపంలో ఆదివారం భారీ మహాసభను నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. దశాబ్ద కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ ఇంత పెద్ద మహాసభను నిర్వహించడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు. పుణె నగర శివార్లలోని హింజేవాడి ఐటి పార్కు సమీపంలో దాదాపు 450 ఎకరాల స్థలంలో నిర్వహించే ఈ మహాసభకు దాదాపు లక్షన్నర మంది హాజరవుతారని భావిస్తున్నారు.

01/02/2016 - 05:34

న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలోనే మొదటిసారిగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన బేసి-సరి సంఖ్యల వాహనాల పథకం కొత్త సంవత్సరం ఆరంభ దినమైన శుక్రవారం ప్రారంభమయింది. ఈ పథకం అమలు వల్ల రోడ్ల మీదకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అందుకు తగ్గట్టుగా ప్రజా రవాణా వ్యవస్థ పెరిగింది. బేసి-సరి సంఖ్యల వాహనాల పథకాన్ని అమలు చేయడానికి వేలాది మంది పోలీసులు మోహరించారు.

01/02/2016 - 05:33

న్యూఢిల్లీ, జనవరి 1: భారత పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శుక్రవారం తమ దేశాల్లోని అణు కేంద్రాల జాబితాను పరస్పరం అందజేసుకున్నాయి. ఈ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఒక దేశానికి చెందిన అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయడానికి వీలు లేదు. ఇటు ఢిల్లీలో, అటు ఇస్లామాబాద్‌లో ఏకకాలంలో ఇరు దేశాలు తమ దౌత్య వర్గాల ద్వారా ఈ జాబితాలను పరస్పరం అందజేసుకున్నాయి.

Pages