S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/10/2016 - 07:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: సియాచిన్‌లో ఆరు రోజుల పాటు మంచుచరియల కింద చిక్కుకున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ అనే జవాను సురక్షితంగా బయటపడ్డాడు. సియాచిన్‌లో 19వేల అడుగుల ఎత్తులో మంచుచరియలు విరిగిపడడంతో పదిమంది సైనికులు గల్లంతయ్యారు. అందులో ఓ సైనికాధికారి ఉన్నారు. వారంతా మద్రాస్ రెజిమెంట్‌కు చెందినవారు.

02/10/2016 - 07:13

ముంబయి, ఫిబ్రవరి 9: పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆర్థిక, సైనికపరమైన మద్దతు ఇచ్చేదని, ముంబయి ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుల్లో ఒకడైన పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ వెల్లడించాడు.

02/10/2016 - 07:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధింపును ధ్రువీకరించే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పట్లో పట్టుదలగా ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉండడమే.

02/10/2016 - 07:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: సిక్కు మత విశ్వాసానికి గుర్తయిన తలపాగా (టర్బన్)ను తీయడానికి నిరాకరించిన అమెరికాకు చెందిన ప్రముఖ సిక్కు నటుడు, మోడల్, డిజైనర్ అయిన వారిస్ ఆహ్లూవాలియాను భద్రతా అధికారులు మెక్సికో సిటీనుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానం ఎక్కనివ్వలేదు.

02/10/2016 - 07:09

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో 2కోట్లకు పైగా కేసులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో పది శాతానికి పైగా కేసులు పదేళ్లు అంతకు పైగా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి.

02/10/2016 - 06:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: వైఎస్‌ఆర్‌సి అధినాయకుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నారని, కాపులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్ష ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, ఏపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై కూడా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

02/10/2016 - 04:26

న్యూఢిల్లీ: తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 700 కోట్లు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 778 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అలాగే, ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని మూడు నుంచి మూడున్నర శాతానికి పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారన్నారు.

02/10/2016 - 04:05

న్యూఢిల్లీ: వీలైనంత త్వరగా రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. విభజన చట్టం హామీలు నెరవేర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. తక్షణం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూనే, రెవెన్యూ లోటు ఐదారేళ్లు ఉంటుంది కనుక ప్యాకేజీ ప్రకటించాలని కోరామన్నారు.

02/10/2016 - 04:01

న్యూఢిల్లీ: రాజ్యాంగ పరమైన పదవులు నిర్వహిస్తున్నవారంతా రాజ్యాంగ పవిత్రతను కాపాడాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఇక్కడ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఉద్బోధించారు. గవర్నర్ల పాత్ర వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో రాష్టప్రతి రెండు రోజుల పాటు జరిగే గవర్నర్ల 47వ సదస్సును ప్రారంభిస్తూ ఈ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

02/09/2016 - 12:00

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో గవర్నర్ల రెండు రోజుల సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు, మహరాష్ట్ర గవర్నర్లు రోశయ్య, విద్యాసాగరరావు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు పాల్గొంటారు.

Pages