S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/09/2016 - 11:54

దిల్లీ: నగరంలోని దిల్షాద్ కాలనీలో మంగళవారం ఉదయం డ్రైక్లీనింగ్ దుకాణంలో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.

02/09/2016 - 06:33

అలహాబాద్, ఫిబ్రవరి 8: గ్రామీణ ప్రాంతాల స్థితిగతుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి గ్రామీణాభివృద్ధి (పిఎంఆర్‌డి) పథకం కింద గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి కృషి చేస్తున్న 230 మంది యువతతో సోమవారం మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

02/09/2016 - 06:31

బృందావనం, ఫిబ్రవరి 8: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సనాతన ధర్మ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకూ మత రాజకీయాలు సాగేవని ఈ రెండింటిని వేరుచేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. భారత దేశాన్ని సుసంపన్న దేశంగా మార్చడమే కాకుండా దాని ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా విశ్వవ్యాప్తం చేయడమే ఎన్‌డిఏ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

02/09/2016 - 06:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు, బొగ్గు క్షేత్రాల కేటాయింపులు, బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులు తదితర పెద్ద పెద్ద కుంభకోణాలుసహా వెయ్యికి పైగా కేసులతో సతమతమవుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సిబ్బంది కొతరతో అల్లాడుతోంది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐలో మూడింట ఒక వంతు మేరకు దర్యాప్తు, పర్యవేక్షణాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు కారణం.

02/09/2016 - 06:55

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నెట్ న్యూట్రాలిటీకి అంతిమంగా టెలికామ్ నియంత్రణా సంస్థ ‘ట్రాయ్’ కూడా ఓటేసింది. వెబ్ వినియోగదారుల నుంచి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు విభిన్న రకాల చార్జీలు వసూలు చేయడంపై ‘ట్రాయ్’ సోమవారం నిషేధం విధించి నెట్ న్యూట్రాలిటీకి ఊతమిచ్చింది.

02/09/2016 - 06:28

ముంబయి, ఫిబ్రవరి 8: ప్రముఖ కవి, హిందీ సినీ గీత రచయిత నిడా ఫజ్లి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఫజ్లీకి భార్య, కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో జన్మించిన ఫజ్లీ గ్వాలియర్‌లో విద్యాభ్యాసం చేశారు. దేశ విభజన సమయంలో తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో స్ధిరపడాలని నిర్ణయించుకోగా, ఫజ్లీ వారితో విభేదించి భారత్‌లోనే ఉండిపోయారు. తండ్రి బాటలో నడిచి రచయితగా పేరు తెచ్చుకున్నారు.

02/09/2016 - 06:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఎన్నారైలు స్వదేశంలో ఎక్కడైనా ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చని జాతీయ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. జస్టిస్ జెఎం మాలిక్ నేతృత్వంలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌డిఆర్‌సి) ఆదేశించింది. గృహ నిర్మాణం కోసం ఎన్నారై చెల్లించిన 64 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలని సూపర్‌టెక్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థకు విజ్ఞప్తి చేసింది.

02/09/2016 - 06:27

అలహాబాద్, ఫిబ్రవరి 8: టైటిల్ సూట్‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా స్పష్టం చేశారు.

02/09/2016 - 01:09

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, అభివృద్ధి పథకాలకు అధిక శాతం నిధులు కేటాయించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపైనా ప్రధానితో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

02/09/2016 - 05:24

ముంబయి: ముంబయిపై జరిగిన 26/11 దాడిలో కుట్ర కోణాన్ని లష్కరే తోయిబా ఆపరేటివ్ డేవిడ్ హాడ్లీ కళ్లకుకట్టాడు. 2008లో జరిగిన దాడికి ముందే రెండుసార్లు విఫలయత్నం జరిగిందన్నాడు. దాడి వెనుక పన్నాగమేమిటి? ఎవరి ప్రమేయం ఉంది? అందులో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఏమిటన్న వౌలిక వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి జిఎ సనప్‌కు వివరించాడు.

Pages