S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/08/2016 - 17:20

హుబ్లీ: కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌లో పురాతన పార్శిల్ భవనం సోమవారం కుప్పకూలింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఎవరూ మరణించినట్లు ఇంతవరకూ సమాచారం లేదు.

02/08/2016 - 17:19

చెన్నై : తమిళనాడులోని కడలూరులో సోమవారం 15 పాఠశాలలకు బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో పిల్లలందర్నీ ఇళ్లకు పంపివేసి బాంబు స్క్వాడ్‌తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని, ఎవరో ఆకతాయిలు ఇలా ఫోన్లు చేసి బెదిరించారని పోలీసులు తెలిపారు.

02/08/2016 - 17:19

చెన్నై: మహోదయ అమావాస్య సందర్భంగా తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం వద్ద కోనేటిలో స్నానం చేసేందుకు భక్తులు పోటీపడగా నీట మునిగి నలుగురు మరణించారు. ఒకేసారి దాదాపు రెండు వేల మంది భక్తులు కోనేటిలో మునిగి పుణ్యస్నానాలు ఆచరించేందుకు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. సుమారు 50 మందిని పోలీసులు కాపాడారు.

02/08/2016 - 14:32

ముంబై: ముంబై దాడుల కుట్ర కేసులో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ సోమవారం కీలక సాక్ష్యం చెప్పే అవకాశం ఉంది. ముంబై కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సాక్ష్యాన్ని న్యాయమూర్తి నమోదు చేస్తారు. ముంబై దాడుల్లో పాకిస్తాన్ పాత్రకు సంబంధించి హెడ్లీ నోరు విప్పే అవకాశం ఉంది.

02/08/2016 - 06:21

భువనేశ్వర్: పర్యావరణానికి హాని కలిగించని సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని, ఈ ఆవిష్కరణలు ఎటువంటి దుష్ప్రభావం చూపనివిగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలకు విజ్ఞప్తి చేశారు.

02/08/2016 - 05:47

పూరీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని సందర్శించిన మోదీకి అక్కడి పూజారులు, స్థానిక బిజెపి నేతలతోపాటు ఆలయ కమిటీ పాలనాధికారి ఎస్.సి.మహాపాత్ర తదితరులు ఘనస్వాగతం పలికారు. దాదాపు 30 నిమిషాలపాటు మోదీ ఆలయంలో గడిపారు.

02/08/2016 - 05:46

జమ్మూ: జమ్మూ-కాశ్మీరులో ప్రభుత్వ ఏర్పాటు విషయమై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) చీఫ్ మెహబూబా ముఫ్తీ నోరు విప్పాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరనెన్స్ (ఎన్‌సి) నాయకుడు ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.

02/08/2016 - 05:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆదాయం పన్ను శాఖకు చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ముఠాలు హ్యాక్ చేశాయి. ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఆర్‌ఎస్‌ఆఫీసర్స్‌ఆన్‌లైన్.జిఓవి.ఇన్’ అనే ఈ అధికారిక వెబ్‌సైట్‌ను శనివారం తెల్లవారుజామున హ్యాక్ చేశారని, అప్పటినుంచి అది అందుబాటులో లేకుండా పోయిందని అధికారులు చెప్పారు.

02/08/2016 - 05:44

న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక వివాదంలో తన వైపు వాదనను వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ తన వెబ్‌సైట్‌లో ‘తరచూ అడుగుతున్న ప్రశ్నలు’, వాటికి సమాధానాలను ఉంచింది. అంతేకాదు, యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐ)సంస్థనుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆర్థికంగా ఎలాంటి లబ్ధి పొందలేదని కూడా పార్టీ స్పష్టం చేసింది.

02/08/2016 - 04:31

పారాదీప్ (ఒడిశా): గతంలో చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల వాటి ఖర్చు పెరిగిపోయేదని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, దేశ ఆర్థికాభివృద్ధి పుంజుకోవాలంటే నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసే సరికొత్త సంస్కృతి అవసరమన్నారు.

Pages