S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/19/2016 - 03:29

న్యూఢిల్లీ, జనవరి 18: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేయడం కానీ, గృహ నిర్బంధంలో ఉంచడం కానీ చేయలేదని ఈ దాడితో సంబంధం ఉన్న కేసులకు సంబంధించి అతని జూనియర్ అనుచరులు ముగ్గుర్ని మాత్రం అరెస్టు చేసారని అధికారులు చెప్పారు.

01/18/2016 - 17:28

ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆదివారం సిరా దాడి చేసిన భావన అరోరా అనే ఆమ్‌ ఆద్మీ సేన యువతిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

01/18/2016 - 16:43

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటుచేసిన తెలుగుదేశం వ్వవస్థాపకుడు ఎన్టీయార్ విగ్రహానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి, ఎంపీలు నివాళులర్పించారు.

01/18/2016 - 16:42

ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇద్దరు సభ్యులతో ద్విసభ్యకమిటీని నియమించింది.
షకీలాశంఘూ, సూరత్ సింగ్‌లతో కూడిన ఈ కమిటీ రోహిత్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నది.

01/18/2016 - 16:41

ఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి.

01/18/2016 - 16:38

అస్సాం : అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్ గువహటి సోమవారంనాడు పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. బాజపా నేత హిమంత బిస్వా శర్మ సీఎంపై వంద కోట్ల రూపాయల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. హిమంత శర్మ బాజపాలో చేరకముందు తరుణ్‌గొగోయ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. సీఎం తనపై రెండు అవినీతి ఆరోపణలు చేసి చర్యలు తీసుకున్నారని హిమంత శర్మ పిటిషన్ దాఖలు చేశారు.

01/18/2016 - 13:55

ఢిల్లీ : ఢిల్లీలో సోమవారం ఉదయం పొగమంచు మంచుకురియడంతో రైళ్లతోపాటు పలు విమాన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. 21 రైళ్లు రద్దయ్యాయి.వాతావరణంలో తేమ 97 శాతం నమోదయ్యింది.

01/18/2016 - 13:07

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడే ఉందని, రానున్న రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు కొత్త ఆవిష్కరణలకు హబ్‌గా తయారవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

01/18/2016 - 12:46

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి చెన్నైలోని సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తమిళనాడు సీఎం జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి రాకతో కోర్టు ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసి పోయింది.

01/18/2016 - 12:44

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామారావు పార్టీకి, దేశానికి సేవలు మరువలేనివని కొనియాడారు.

Pages